పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన హీరోయిన్ నిరోషా….!!

Share this :

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి రాధిక చెల్లెలు నిరోషా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటింది. తాజాగా  నిరోషా ఇంట చోరీ జరిగిన న్యూస్ తెగ వైరల్గా మారింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగతనం జరింగిందటు నిరోషా తేనాంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.గోల్డ్ ఆభరణాలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా కనిపించకుండా పోయాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఈ విషయం పై పోలీసులు విచారణ ప్రారంభీంచారు.

నిరోషా ఘర్షణ మూవీలో హీరోయిన్‌గా కనిపించి యూత్‌కు బాగా దగ్గరైంది. ఈ మూవీలో నిరోష అందాలతో కుర్రాళ్లను గిలిగింతలతు పెట్టింది.  ఆ మూవీలో ఆమె ఒక బృందావనం,సోయగం అంటూ చెరువులో జలకాలాడింది. అయితే ఇప్పటికీ ఈ పాట ఇంకా అభిమానులకి గుర్తుండిపోయింది. తర్వాత ఆమె చేసిన సింధూరపువ్వు మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఆమె సినిమాలకు దూరం ఇంది. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు సినిమాల్లో కనబడుతుంది.