ఆసియాకప్ నేపాల్‌లో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. నేడు జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ సరిగ్గా లేదనే చెప్పాలి. గ్రౌండ్ లో చాలా వరకు భారత పేలవంగా ఆడారని ర్శలు వినిపిస్తున్నాయి. పసికూనలైనా వాళ్లు ఆడిన ఆటతీరు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. మొదటి ఐదు ఓవర్లలోనే మూడు క్యాచ్‌లు వదిలేసారు. ఇంకేముంది నేపాల్ ఆటగాళ్లకు ఇది మంచి వరంగా మారింది. దాంతో నేపాల్ బ్యాటర్లు యమ జోరుమీద కనబడుతున్నారు.
భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. అయితే మహమ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ లాస్ట్ బంతికి భుర్టెల్ ఇచ్చిన క్యాచ్ ను శ్రేయాస్ అయ్యర్ వదిలేయగా, ఆ తర్వాత ఓవర్ మొదటి బంతికే ఆసిఫ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కూడా విరాట్ కోహ్లీ గాలికొదిలేసాడు.
ఆ కారణంగా కోహ్లీపై గుర్రుమంటున్నాడు భారత కెప్టెన్ రోహిత శర్మ. తర్వాత మరలా అదే ఓవర్లో భుర్టెల్ ఇచ్చిన ఇంకొక ఈజీ క్యాచ్ ను కీపర్ ఇషాన్ కిషన్ వదిలేశాడు. దాంతో టీమిండియా చేస్తున్న ఫీల్డింగ్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఫీల్డింగ్ చేయడానికి ఇది రిహల్సల్ కాదని ఇండియా మొత్తం ఎదురు చూస్తుందని నెట్టింటా ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.
