సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఆ పనిచేసేవాడట.. సాలరీ ఎంతంటే?

Share this :

తెలుగు ఇండస్ట్రీలో నట వారసులు ఎంతోమంది వచ్చారు.. కానీ కొద్ది మంది మాత్రమే మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరో స్థాకియి ఎదిగారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత, నటుడు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నా తర్వాత వరుస విజయాలతో ఐకాన్ స్టార్ గా ఎదిగారు. అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరో అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీతో బన్నీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్. పుష్ప సక్సెస్ తో బన్నీ తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 కోసం ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ఇండస్ట్రీలోకి రాకముందు అల్లు అర్జున్ చేసిన ఉద్యోగానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఈ సీక్రెట్ ఎవరికీ తెలిదు అని అంటున్నారు. మొదటి నుంచి అల్లు అర్జున్ కి యానిమేటెడ్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమట.. సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఇంటర్న ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేశాడట. ఇందుకోసం ఆయన నెలకు రూ.3,500 జీతం కూడా తీసుకున్నారట. ఇదే అల్లు అర్జున్ మొదటి సంపాదన.. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.