విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. పోస్ట్ మార్టం రిపోర్ట్!

Share this :

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల ఆయన బిచ్చగాడు 2 షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి కోలుకున్న ఆయనను మరో విషాదం వెంటాడింది. ఆయన ముద్దుల కూతురు మీరా విజయ్ ఆంటోనీ (16) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. ప్రస్తుతం మీరా పన్నెండో తరగతి చదువుతుంది. గత కొంతకాలంగా చదువు విషయంలో మీరా తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్న కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంటున్నారు.

పాన్ ఇండియా లెవెల్లో విజయ్ ఆంటోనీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన బిచ్చగాడు 2 మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం చెన్నైలోని డీడీకే రోడ్డు లో విజయ్ ఆంటోనీ కుటుంబం నివాసం ఉంటుంది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో విజయ్ ఆంటోనీ తన కూతరు మీరా పుట్టినప్పటి నుంచి మంచి సక్సెస్ కలిసి వచ్చిందని.. తన కూతురు అంటే ప్రాణం అని అన్న విషయం తెలిసిందే. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా విజయ్ ఆంటోనీ తన కుటుంబానికి ఎంతో సమయం కేటాయించేవారు. ఇక విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా కూడా తన కూతురు కోసం ఇంటికే పరిమితం అయినట్లు చెబుతున్నారు.

గత కొంత కాలంగా చదువుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురై మంగళవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై విజయ్ ఆంటోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మీరా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు ఆమెది ఆత్మహత్యే అని.. మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని ప్రకటించారు. ఎంతో గారాబంగా పెంచుకుంటున్న కూతురు ఆకస్మిక మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలంటూ సంతాపాన్ని ప్రకటిస్తూ నెట్టింట్లో ట్వీట్లు పెడుతున్నారు నెటిజన్లు.