చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన బాలయ్య బాబు

Share this :

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత ఐనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే దాని గూర్చి స్టార్ హీరో మరియు ఆయన వియ్యంకుడు ఐనా బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. హీరో బాలకృష్ణ చంద్రబాబు అరెస్ట్ గూర్చి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అనేది దుర్మార్గమని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు.

జగన్ మొదటి నుండి ఎలాగైనా సరే చంద్రబాబును జైలులో ఉంచాలనేది ఆయన కుట్ర అని బాలయ్య అన్నారు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేశారని బాలయ్య కామెంట్స్ చేశారు. ఒకవేళ అవినీతి అనేది నిజంగానే ని జరిగి ఉంటే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ఆయన అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు. మేము న్యాయ పోరాటం ద్వారా ప్రజల మధ్యలో తేల్చుకుంటామని అన్నారు.అయితే చిలకలూరిపేట మాజీ మంత్రి పుల్లారావు గారు కూడా దీనిపై స్పందిస్తూ ఆయన అరెస్ట్ వల్ల ఏపీలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు్చేశారు. ఇంకా ఎందరో నేతలు ఈ అరెస్ట్ ను ఖండించి వారి వారి కార్యకర్తలతో తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.

చంద్రబాబు నిస్వార్థ ప్రజా సేవకుడు అని కేశినేని అన్నారు. మరి కొందరు టీడీపీ నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ ను కూడా సీఐడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్త ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కేసు విషయంలో ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.