నేటి నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం…!!

Share this :

తెలంగాణ ప్రభుత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు కల నెరవేరే రోజు రానే వచ్చింది. దాంట్లో భాగంగానే డీఎస్సీ ద్వారా టీచర్‌ ఉద్యోగాల భర్తీ చేయాలనీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది అందరికి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలను కొత్తగా వచ్చిన రోస్టర్‌ విధానం ప్రకారం నియమించాలని కూడా నిర్ణయించింది.కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాత రోస్టర్‌కు ముగింపు పలికి మరలా రోస్టర్‌ను ఒకటవ పాయింట్‌ నుంచి ప్రారంభించారు. అయితే దాని వల్ల కొత్త రిజర్వేషన్‌ విధానం అమల్లోకి వచ్చింది.

ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ రిలీజ్ చేసింది. పోస్టుల వారీగా రోస్టర్‌ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందు పరచడం జరిగింది. ఇప్పటికే అన్నీ జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది నేటి నుంచి స్టార్ట్ చేసారు.అభ్యర్థులు మంగళవారం రాత్రి 12 గంటల నుంచే దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇచ్చారు.అయితే వచ్చే నెల (అక్టోబర్)21 వరకు ఆన్‌లైన్‌లో టీఆర్టీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విధంగా వీలు కల్పించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానికసంస్థల పాఠశాలల్లో 5,089 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. డీఎస్సీ ద్వారా ఫిల్ అప్ చేసే ఉపాధ్యాయ పోస్టుల్లో యాభై ఒక్క శాతం పోస్టులు మహిళలకే కేటాయించారు.ఇవే కాకుండా ఇక ఓపెన్‌ జనరల్‌ విభాగంలో కూడా వారు పోటీ పడే ఛాన్స్ ఉన్నది. ఓపెన్‌ జనరల్‌ కోటాలో మరో 2,451పోస్టులను వారికీ కేటాయించి ఉన్నాయి. ఓపెన్‌ జనరల్‌ కోటా పోస్టుల్లో పురుషులతో పాటు, మహిళలు పోటీపడే అవకాశం ఉన్నది. అయితే ఈ పోస్టులను మాత్రం మెరిట్‌ అధారంగా అయితే భర్తీ చేస్తారు.వెలువడిన నోటిఫికేషన్ లో దాదాపు ట్వంటీ ఫోర్ జిల్లాల్లో అత్యధిక పోస్టులు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి.కనుక ఉన్న పోస్ట్లు పురుషులకి తక్కువ కనుక ఈ సారి పోటీ అనేది గట్టిగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.