ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాన్ వారాహి యాత్ర దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం యాత్ర సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ యువగళం పాదయాత్ర తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇక ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు.
