బెంగళూరు, అక్టోబర్ 30: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో సోమవారం (అక్టోబర్ 30) ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ గ్యారేజీ (Bus garage)లో మంటలు చెలరేగడంతో 22 ప్రైవేటు బస్సులు (Private Bus) దగ్ధమయ్యాయి. గ్యారేజీలో పార్కింగ్ (Parking) చేసి ఉన్న బస్సుల (Bus)కు మంటలు అంటుకుని అగ్నికి ఆహుతయ్యాయి. అసలేం జరిగిందంటే..
బెంగళూరులోని వీరభద్రగనగర్లోని గ్యారేజ్‌లో 22 బస్సులు నిలిపి ఉన్నాయి. వాటిల్లో ఒక బస్సుకు వెల్డింగ్ పనులు (welding work) చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వెల్డింగ్ మెషిన్ (welding machine) నుంచి వచ్చిన స్వార్క్ మంటలు ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. అనంతరం రెప్పపాటులోనే గ్యారేజీ (garage)లో నిలిపి ఉన్న ఇతర బస్సుల (Bus)కు మంటలు మిగతా బస్సులకు వ్యాపించి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (fire tenders) హుటాహుటీన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదం సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించి భయానకంగా అక్కడి పరిస్థితులు కనిపించాయి. గ్యారేజీలో మొత్తం 35 బస్సులు ఉండగా.. వాటిల్లో 18 బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మరో నాలుగు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయని (partially damaged) అగ్నిమాపక అధికారులు తెలిపారు.
#BreakingNews
Massive fire near a garage in Bengaluru, fire-fighting teams on spot #Bengaluru #BengaluruFire #accident pic.twitter.com/YGG7FCak7F— Suchitra Das (@Suchitra_Dass) October 30, 2023
గ్యారేజీ బహిరంగ ప్రదేశంలో ఉండటంతో మంటలను గమనించిన వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
