Social Media Stars in Politics హైదరాబాద్, నవంబర్ 22: సోషల్ మీడియా (Social Media)లో రీల్స్, డాన్స్ వీడియోస్, వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అయిన యూట్యూబర్లు (youtuber) గుంటి నాగరాజు (Youtuber Gunti Nagaraju), బర్రెలక్క (Barrelakka) స్వతంత్ర అభ్యర్ధులుగా (TS independent candidates) నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుంటి నాగరాజు నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) కొల్లాపూర్ (Kollapur) నుంచి బర్రెలక్క నామినేషన్ వేసింది. వీరిద్దరికీ విజిల్ గుర్తు కేటాయించారు. ఇండిపెండెంట్ క్యాండెట్లుగా నామినేషన్లు వేసిన వీరిద్దరూ తాజాగా ప్రచార కార్యక్రమాలు కూడా మొదలెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయా (TS Politics)ల్లో ప్రస్తుతం వీరిద్దరి పేరు మారుమ్రోగిపోతోంది. వీరు ప్రచారానికి సంబంధించి వినూత్నంగా వీడియోలను రూపొందించి తమ యూట్యూబ్ ఛానెల్‌లలో పోస్ట్ చేస్తూ వినూత్నంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
చదవండి: Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్..!
ఎవరీ గుంటి నాగరాజు..
గుంటి నాగరాజు (Youtuber Gunti Nagaraju) తొలుత టిక్ టాక్ చేస్తూ.. రైతు బిడ్డగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. తనకున్న బైక్ మీదనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ఒక్కడే ప్రచారం చేస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతున్నాడు. గుంటి నాగరాజుకు సోషల్ మీడియాలో 2 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారంటే అతనికున్న క్రేజ్ ఏమాత్రమో అర్ధం చేసుకోవచ్చు. అయితే గుంటి నాగరాజు ప్రచారాన్ని వెంటనే ఆపేయాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓ వీడియోలో తనగోడు చెప్పుకొని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ వీడియోలో..
‘నేను నామినేషన్ వేయడం తప్పా.. రైతు బిడ్డగా సామాన్యులకు సహాయం చేయాలని నామినేషన్ వేశాను. అర్ధరాత్రి ఫేక్ కాల్స్ చేసి వెంటనే నామినేషన్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే చంపుతామంటూ బెదిరిస్తున్నారు. ఎవరెంత బెదిరించినా నేను మాత్రం ఎన్నికల నుంచి తప్పుకోను. కాల్స్ చేస్తున్న వాళ్లు ఇతర పార్టీలకు చెందిన వాళ్లా లేదా ఫేక్ కాల్సా అనేది ఖచ్చితంగా తెలియదు’ అంటూ ఏడుపు లంకించుకున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘నీ ప్రయత్నం ఆపకు.. ఏదోక రోజు తప్పనిసరిగా నువ్వు ఎమ్మెల్యే అవుతావ్ అంటూ ప్రోత్సహిస్తుంటే.. నీకు డిపాజిట్ కూడా రాదంటూ మరికొందరు నిరుత్సాహ పరుస్తున్నారు. నీలాగే బర్రెలక్క (Barrelakka) కూడా నామినేషన్ వేసింది. ఆమె నాగర్‌కర్నూల్ జిల్లాకుచెందిన ఆడబిడ్డ. నీకు సపోర్ట్‌గా మేమున్నాం.. ఓట్ల కోసం నువ్ ట్రై చేయి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: Uttar Pradesh Horror: పగా.. ప్రతీకారమా? పట్టపగలు హత్యాచార బాధితురాలిని నడిరోడ్డుపై నరికి చంపిన వైనం
సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క..
ఇక మరో సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (Barrelakka).. ప్రస్తుతం ఆమె పేరు కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా వినిపిస్తోంది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలు పోటీపడుతుంటే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా రాజకీయ నేతలను ఢీ కొట్టేందుకు బర్రెలక్క నామినేషన్ వేసింది. అంతటితో ఆగకుండా ప్రచారం కూడా ముమ్మరంగానే సాగిస్తోంది. బర్రెలక్క అసలు పేరు శిరీష. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె సొంతూరు. శిరీష సోషల్ మీడియా వీడియోలు ఎంత పాపురల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎంత చదివినా డిగ్రీలకు డిగ్రీలు వస్తున్నాయే గానీ జాబ్‌లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయరు. అందుకే మా అమ్మను అడిగి 4 బర్రెలు కొన్నా. పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు మొత్తం 6 లీటర్ల పాలు ఇస్తాయ్. రోజుకు రూ.300 వస్తాయ్ ఫ్రెండ్స్. ఇవ్వే మా బర్లు’..అంటూ వినూత్నంగా ఆమె చేసిన వీడియో నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అలా ఆమె బర్రెలక్కగా పాపులర్ అయ్యింది. ఆమె చేస్తున్న వీడియోలు ఇప్పటికీ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
View this post on Instagram
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బర్రెలక్కను కూడా టార్గెట్ చేస్తూ కొందరు నేతలు బెదిరింపులకు దిగారు. తమ దారికి అడ్డొస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నట్లు తాజా రాజకీయాలు మారిపోయాయి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి.. తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో శిరీష ఆమె సోదరుడుతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సామాన్యుల మొదలు సెలబ్రెటీల వరకు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎప్పుడైతే శిరీషపై దాడికి యత్నం జరిగిందో అప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. శిరీష సోదరుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పిస్తామని తెలంగాణ డీజీపీ, ఎన్నికల కమిషన్, సీఈవో ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు కూడా పెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా స్టార్లు బడా నేతలకు కొరకరాని కొయ్యల్లా మారారు.
Adequate security be provided to Ms. Sirisha @ barrelakka independent candidate from kollapur constituency, Nagarkurnool district, Telangana & her family members in view of the attack on her brother today. @TelanganaDGP @ECISVEEP @CEO_Telangana
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) November 21, 2023
ఏపీ ఎలక్షన్లలో కూడా పోటీ చేస్తారేమో..?
మరోవైపు 6 నెలల్లో ఏపీలో కూడా ఎన్నికలు మొదలవ్వనున్నాయి. అప్పుడు కూడా రాజకీయాల్లోకి సోషల్ మీడియా స్టార్లు ఎంట్రీ ఇస్తారేమోనని పలువురు నేతలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వీళ్లు రాజకీయ నేతలకు తలనొప్పిగా తయారయ్యారు. వీళ్లకున్న ఫాలోవర్లను చూస్తుంటే ఎన్నికల్లో గెలిచినా గెలవచ్చు.. గెలవకపోయినా ఎవరో ఒకరిని ఓడించే శక్తి వీళ్లకు ఉందంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో వీళ్లకున్న క్రేజ్‌ను చూస్తుంటే వీళ్లు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. అనేంతగా మారిపోతున్నాయ్ నేటి రాజకీయాలు. మరోవైపు వీళ్లు ఎన్నికల పోటీల్లో ఉండటం వల్ల వీళ్లను బెదరగొట్టడానికి కూడా రాజకీయ నాయకులు వెనకాడటం లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా సోషల్ మీడియా స్టార్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. యాధృశ్చికంగా గుంటి నాగరాజుకు, బర్రెలక్క..ఇద్దరు సోషల్ మీడియా స్టార్లకు విజిల్ గుర్తు వచ్చింది. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతోన్న వీళ్లు ఎవరి చెవుల్లో మోత మోగిస్తారో చూద్దాం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.