Mansoor Ali Khan Public Apology to Actress Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష (Actress Trisha)పై ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం లేపాయి. తమిళ మువీ ‘లియో (Leo Movie)’లో త్రిష (Trisha), విజయ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ మువీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే ఈ మువీలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించాడు. అతను ఇటీవల ఓ ఇంటర్వ్యూ (Mansoor Ali Khan interview)లో మాట్లాడుతూ.. నటి త్రిష (Trisha Krishnan)పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
‘లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. ఈ సినిమాలో ఒక్క బెడ్ రూం సీనైనా ఉంటుందని అనుకున్నా. ఆమెతో ‘బెడ్రూమ్ సీన్’ చేసే అవకాశాన్ని కోల్పోయాను. గతంలో ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లతో రేప్ సీన్లలో నటించాను. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనకు ‘లియో’ కథ చెప్పినప్పుడు త్రిషతో కూడా ఒక రేప్ సీన్ ఉంటుందని భావించా. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదని’ అంటూ మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మండిపడ్డారు. కోలీవుడ్ తారలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మంత్రి రోజా మొదలు.. సింగర్ చిన్మయి శ్రీపాద వరకు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఒక్కొక్కరుగా దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నారంటూ మండిపడ్డారు.
View this post on Instagram
ఇలాంటి వ్యక్తితో ఇకపై నటించను.. త్రిష
మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ.. ‘మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నేను చూశాను. ఒక స్త్రీని అగౌరవంగా, ద్వేషపూరితంగా మాట్లాడాడు. మరోసారి మన్సూర్ అలీ ఖాన్‌తో కలిసి నటించను. ఇలాంటి వారి వల్ల మనుషులందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు.
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023
మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్
నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకన్నా ఈ ప్రపంచంలో ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయని, ప్రస్తుతం స్పందిస్తోన్న పెద్దవాళ్లంతా వాటిపై మాట్లాడాలని సూచించాడు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం అని అన్నాడు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నాడు. అయితే ఈ ఘటనపై త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదని తెగేసి చెప్పాడు. అయితే హీరోయిన్ త్రిషపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదానికి దారితీయడంతో.. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగతంగా హజరై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో అతను ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ విచారించిన స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.

ఎట్టకేలకు మన్సూర్ క్షమాపణలు..
ప్రపంచ మహిళా కమిషన్ త్రిషకు మద్దతుగా నిలిచింది. మన్సూర్ అలీఖాన్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తమిళనాడు డీజీపీ శంకర్ జివ్వాల్‌కు ఫిర్యాదుచేసింది. దీంతో మన్సూర్ అలీ ఖాన్ చైన్నె హైకోర్టు (Chennai High Court)లో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై 354(ఏ), 509 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. గురువారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరైన మన్సూర్ అలీఖాన్ తాను ఏ దురుద్దేశంలోతోనూ త్రిషపై వ్యాఖలు చేయలేదని కమిషనర్‌కు విన్నవించాడు. మరోవైపు తన ముందస్తు బెయిల్ కోసం చైన్నె హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుని నటి త్రిషకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. తొలుత మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించినప్పటికీ, గత కొన్ని రోజులుగా ఈ వివాదం మరింత ముదురుతుండటంతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడినట్లైంది. ఈ మేరకు మన్సూర్ సోషల్ మీడియాలో బహిరంగ ప్రకటన (Mansoor Ali Khan apology note for Trisha) విడుదల చేశాడు..
View this post on Instagram
‘కత్తి లేకుండా నేను ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను! నాకు అండగా నిలిచిన నాయకులు, నటీనటులు, పాత్రికేయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను తప్పుపట్టిన వ్యక్తులకు వినయపూర్వకమైన నమస్కారాలు. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. అప్పుడు లక్షలాది మంది చనిపోవడంతో, సామ్రాట్ అశోకుడి గుండె నుంచి రక్తం ఏరులైపారింది. దీంతో ఆయన అహింసను స్వీకరించాడు. ఇక్కడ నేను కూడా అహింస మార్గం వైపే నిలబడ్డానంటూ’ మన్సూర్ తన ప్రకటనలో తెలిపాడు. ఇక మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణపై త్రిష ఎక్స్ వేదికగా స్పందించారు.
To err is human,to forgive is divine🙏🏻
— Trish (@trishtrashers) November 24, 2023
‘తప్పు చేయడం మనిషి సహజ లక్షణం’ అంటూ నమస్కరిస్తున్న చేతుల ఎమోజీని తన పోస్టులో జోడించారు. కాగా చెన్నై పోలీసులు మన్సూర్‌కి సమన్లు జారీ చేసిన ఒక రోజు తర్వాత మన్సూర్ క్షమాపణలు చెప్పడం విశేషం.

3 Comments
Comments are closed.