Kantara Chapter 1 Teaser: ఆసక్తి రేకెత్తించేలా ‘కాంతార చాప్టర్‌ 1′ టైటిల్‌.. సాక్షాత్తు శివుడిని తలపించేలా టీజర్‌

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న కాంతార ప్రీక్వెల్ టీజర్

Share this :

Kantara Chapter 1 Teaser out: కన్నడలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)’ త్వరలో కాంతార ప్రీక్వెల్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. 2022లో విడుదల చేసిన ‘కాంతర (Kantara)’ సినిమా దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసించింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఓ చిన్న సినిమా అనూహ్యంగా పాన్ ఇండియా వరకు చేరింది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మువీ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక కాంతర మూవీకి సీక్వెల్ (Kantara Chapter 1 teaser) వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటి నుంచి రిషబ్ శెట్టి అఫీషియల్‌గా ఎప్పుడు ప్రకటిస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాంతార మూవీ లవర్స్‌కి పూనకాలు తెప్పించే అప్డేట్ తాజాగా బయటకి వచ్చింది.

చదవండి: PM Modi Roadshow: 2 గంటలపాటు ఆ రెండు మెట్రో స్టేషన్లు మూసివేత.. నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోమవారం (నవంబర్‌ 27) విడుదల చేసింది. ‘కాంతార ఏ లెజెండ్ ( Kantara A Legend Chapter 1)’ అనే టైటిల్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు’ అంటూ రిషబ్‌ ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. అవతారంలో ఓ చేతిలో త్రిశూలం పట్టుకుని, మరో చేతిలో గండ్ర గొడ్డలి పట్టుకోని కనిపించిన రిషబ్ శెట్టి పొడవాటి జుత్తు, నెత్తుటితో తడిచిన దేహం, ఆవేశం నిండిన చూపులతో ఆయన లుక్‌ భయపెట్టేలా ఉంది.

కాంతార క్లైమాక్స్‌లో వరాహ అవతారంలో జస్ట్ శాంపిల్ చూపించిన రిషబ్ శెట్టి.. ఈ ప్రీక్వెల్‌లో సాక్షాత్ పరమ శివుడినే చూపించబోతున్నట్లు భారీగా అంచనాలు పెంచేశారు. తాజాగా హోంబలే విడుదల చేసిన కాంతారా ప్రిక్వెల్‌ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కేవలం గంటల వ్యవధిలోనే యూట్యూబ్‌లో 3 మిలియన్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. గతేడాది విడుదలైన కాంతారలో చూసిన కథ కన్నా ముందు ఏం జరిగింది? అసలు వరాహ అవతారం కథ ఎక్కడి నుంచి మొదలయ్యింది? అనే కథాంశంతో కాంతర పార్ట్ 1ను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్‌లో.. ‘దారి చూపించేది వెలుగు కాదు దర్శనం’.. అంటూ మొదలయ్యింది. దీంతో కాంతర పార్ట్ 1పై ఒక్కసారగి హైప్ పెరిగిపోయింది. టీజర్‌లో ఇంకో మెయిన్ హైలైట్ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌. కాంతర సినిమాకి ప్రాణం పోసిన అజనీష్ మరోసారి తన మ్యూజిక్‌ మ్యాజిక్ ని చూపించాడు. పాన్‌ ఇండియా టార్గెట్‌గా ఏడు భాషలకు ఒకటే టీజర్‌ను రిషబ్ శెట్టి విడుదల చేశాడు. ఈసారి ఎలాంటి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ చూపిస్తాడా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.