మిస్టరీగా మారిన వలస పక్షుల సూసైడ్ ! మన దేశంలోనే ఉన్న ఆ ప్రదేశం ఎక్కడంటే ??

Share this :

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి  ప్రపంచంలో కొన్ని వింతలు, విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. మన దేశంలో పక్షులు సూసైడ్ చేసుకోవడానికి ఒక ప్రదేశం ఉందంటే మీరు నమ్ముతారా ?? అవునండి మీరు విన్నది నిజమే ఆ ప్రదేశం మన దేశం లోని జటింగా అనే గ్రామం లో ఉంది . ఈ ప్రదేశం లో పక్షులు సంవత్సరానికి ఒకసారి వెలది గా వచ్చి చంపోతుంటాయి . ఈ చనిపోయిన పక్షులలో వలసగా వచ్చినవే కాకుకుండా స్థానికంగా ఉన్న పక్షులు కూడా చనిపోతూ ఉంటాయి . అయితే ఈ ఘటన గురించి ఆ గ్రామా ప్రజల్లో ఒక నమ్మకం ప్రాచుర్యం లో ఉంది . పక్షులు సూసైడ్ చేసుకుంటున్న ఆ గ్రామ వివరాలు ఏంటంటే …

ఆ గ్రామం అస్సాం లోని గౌహతి కి 330 కి.మీ దూరంలో ఉన్న జటింగా అనే గ్రామం . అయితే ఈ గ్రామాన్ని పక్షులు ఆత్మహత్య చేసుకునే వింత గ్రామం గా పొరుగు గ్రామా ప్రజలు పిలుస్తుంటారు . పక్షులు ఎక్కువగా ఆగస్టు, నవంబర్ నెలల్లో వివిదా ప్రాంతాలనుండి వచ్చిన వివిధ జాతుల పక్షులు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి . అమావాస్య రోజుల్లో , చంద్రకాంతి రాని రోజుల్లో మరియు చీకటి అలుముకున్న రోజుల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం . అయితే ఈ విషయాలు సోషల్ మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రచారం కూడా జరిగింది.

ఈ విషయాల గురించి పరిశోధనలు ఎక్కువగానే జరిగాయి. పరిశోధకులు తమ ఎన్నో పరిశోధనల అనంతరం ఒక క్లారిటీ కి వచ్చారు . ఈ ప్రాంతం లో అధిక అయస్కాంత శక్తి ఉన్నటు గుర్తించారు. అదేకాకుండా చలికాలంలో అతి తక్కువ శీతోష్ణ స్థితి ఉన్నట్లు గమనించారు. అంతే కాక చలికాలంలో పొగ మంచు కారణంగా అక్కడి బలంగా వీచే చలిగాలి అయస్కాంత క్షేత్రం లోకి పక్షులు నెట్టబడి కళ్ళు కనిపించని స్థితిలో ఎత్తైన ప్రదేశాలను ఢికొట్టి లేదా చుట్టూ ప్రక్కల ఉన్న ఇళ్లను ఢీకొట్టి చనిపోతున్నాయని వారు గుర్తించారు. అయితే వారు ఈ విషయాన్నీ పరిశోధకులు సోషల్ మీడియా ముఖంగా ఈ మూఢనమ్మకాన్ని ఆ గ్రామా ప్రజల్లో రూపుమాపాలని చూస్తున్నారు.