పెళ్లి విందులో ఆ ఒక్కటి తక్కువయిందని కొట్టుకున్న అతిధులు ??

Share this :

అరుదుగా పెళ్లిళ్లలో ఏదో ఒక చిన్న విషయం దగ్గర పెళ్లికొచ్చిన ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. అది పెళ్లి కి పెట్టె కట్న కానుకల విషయంలో కావచ్చు లేదా పెళ్లి ఏర్పాటు చేసిన అతిధి మర్యాదలు కావచ్చు లేదా వివాహ విందులో ఏర్పడ్డ అసంతృప్తి కావచ్చు. మొత్తానికి ఆ వివాదాలు కాస్త చిలికి చిలికి గాలి దుమారం గా మారుతాయి.

అటువంటి సంఘటనే మీరు చూస్తున్న ఈ వీడియో లో స్పష్టంగా తెలిసిపోతుంది . వివరాలలోకి వెళితే పాకిస్తాన్ లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది . ఆ వీడియో ని గమనించినట్లయితే తెల్లని తెరకు అవతల స్త్రీ లు మరోవైపు పురుషులు భోజనం చేస్తున్నారు . ప్రతి టేబుల్ చుట్టూ 14 నుండి 15 మంది దాక కూర్చుని విందు చేస్తున్నారు . అయితే వేరొక గ్రూప్ లోని వ్యక్తి వచ్చి భోజనం చేస్తున్న వ్యక్తి తో అసందర్భంగా గొడవ పడి కొడతాడు ఈలోగా చుట్టుపక్కల ఉన్న బంధువులు మరియు స్నేహితులు గొడవలోకి దూరిపోయారు .

ఈ వీడియో లో రాడ్లతో , కర్రలతో , కుర్చీలతో కొట్టుకోవడం మనం గమనిస్తాం . అయితే ఈ గొడవతటికి కారణం ఏంటని పెళ్లి పెద్దలు ఆరాతీయగా పెళ్లికొచ్చిన వియ్యాలవారికి వచ్చిన బిర్యానీలో మటన్ ముక్క రాలేదట . కేవలం ఒక్క మటన్ ముక్క కోసం ఇంత రచ్చ చేయాలా అంటూ సోషల్ మీడియా అంత సదరు వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది …ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే 368.7K వీక్షణలను పొందింది