ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదేనేమో జాంబ… మీ అమ్మెల్యే కాంతం సారు ఏం సెప్నాడు ప్పా… ఏం మాట్టాడతాండడో ఆయప్పకే తెలీకుండా ఉండాది…
ఒరేయ్…జాంబ యాడున్నవురా… పోన్ ఎత్తరా…
హా…లో… హా…లో.. రేయ్ ఎవుర్రా మాట్టాడేది… రేయ్ జాంబిగా నేన్ సాంబన్ని…
రేయ్… నువ్వా… నేనే పోన్ చేద్దామనుకుంటాన్యా …
సూసినావ్… మా అమ్మెల్యే కాంతం సారు… బాబు సారు కు బాగా రాడ్ దింపినాడు…
నువ్వు మీ అమ్మెల్యే కాంతం సారు ఏంది రా దింపేది…
బాబు సారు… వొళ్ళ ఊల్లో ఓడిపోతాడా… మీ మొఖాలు ఎప్పుడైనా అద్దంలో సూసుకున్యారా రా జాంబిగా… మీరు మీ మొఖాలు…
పొయ్యి చిలుకను పట్టకచ్చుకో జోతిష్కం చెప్పు కుందువు…
అన్ని ఎలచ్చన్లలో మీరే గెల్చినారా… అబ్బా నిజమే రో… మీ సారోల్లంత నీతి, నిజాయితీ పరులు పేపంచంలోనే లేరు కదా…
పెజాసామ్యంగా మీరు ఒక ఎలచ్చనన్నా సేసినార్రా…
ఏం మాట్టాడతాండవ్ రా నువ్వు…
ఔను… బే
ఒరేయ్ … మనూల్లో ముసిపాలిటి ఎలచ్చనలు ఎంత సక్కమంగా సేశినార్రా…
సిగ్గు , మానం ల్యాకుండా ఎలచ్చన్లకే గుడ్డలు పెరికినారు
కదరా…
ఏంది రా దింపేది… మీరు మీ కాంతం సారు…
ఒక్క రవ్వన్నా భయం బత్తి ఉందారా మీకు…
ఆపీసు బైట పోలీసోల్లను కాపలా పెట్టి… పక్క పాట్టీ ఓళ్ళు నామినేసన్ ఎసేదానికి పోతే గేటు కాన్నే అన్నాయంగా కొందర్ని నిలబెట్టి ఏం ఇబ్బందులు పెడితిర్రా…
ఇంగ ఆడ్నుంచి ఆపీసు లోపలి కి పోతే నామినేసన్ పేపల్లు తీసుకొని చించేసిరి… మొఖాల మిందె రత్తాలు వచ్చేటట్టు కొట్రి సిగ్గు యెగ్గు లేకుండా…
పెజాసామ్యాన్ని మీ కాంతం సారు ఆపరేసన్ సేసి బతికిచ్చినాడు రా… చానా గొప్పోడు మీ సారూ…
ఇదేనా మీ కాంతం సారు దుస్టిలో పెజాసామ్యం అంటే…
ఇపుడు ఎలచ్చన్ చేసేది నేర్పిచ్చినారు మీరు… రేపు వాళ్ళ గవన్మెంట్ వచ్చినాక మిమ్మల్ని ద్యాండ్లతో కొడతార్రా… ఆలోసించుకో… అబ్బా నాకైతే మీ పరిత్తితి అత్తం కావడం ల్యా…
వార్డు, సప్పంచ్, కొంసిలర్ ఎలచ్చన్లలో మిమ్మల్ని సన్నగ కొట్రేమోరా… నామినేసన్ కు పోతే…
ఈడ అన్ని రకాల గొబ్బు పనులు, పాపాలు సేసి ఆడ బాబు సారు కాడికి పోయి ఏందో సేస్సారంట…
ఈ ఎలచ్చన్లకు ఆడికి పోయినారనుకోండి రేయ్… ఆడ జనాలు గుడ్డలు ఊడ బెరికి కుక్కను కొట్టినట్టు కొడతార్రే మీకు… నువ్వు భద్రంగా ఉండ్రే…
సీసేలం నించి కిష్ణా నీళ్ళు సారోల్ల వూరికి ఇచ్చినారా… సర్లే భలే మాంచి పని సేసినారు…
అందుకేనా అన్ని సీట్లు మాకే వచ్చాయని క్యాకలు ఏచ్చా ఉండేది…
అయితే మళ్ళ
పులిందలలో సీనాకాయలు ఎండిపోతాండయని… పంట పోతాదంటే నీళ్ళు ఇచ్చింది ఓరో మీ కాంతం సారు కు తెలీదా?
ఆ పొద్దు మీరంతా మ్యాకల కాడికి పోయి గురకల్ పెట్టి నిద్దర పోతా ఉన్యారా???
ఆ పొద్దు ఒందల ఎకరాలకు బాబు సారే నీళ్ళిచ్చింది… గుర్తు పెట్టుకొరా జాంబి…
ఉడత కెందుకు ఊళ్ళో పెత్తనం అన్నెట్టు మీ కాంతం సారు కెందుకు రా…
నేను తప్ప ఇంగెవరూ రాట్టంలో మాట్లాడలేరు… ఇంగెవరికి చ్యాతకాదని అనుకున్యారా ఏంది…
ఔను రేయ్ అన్నీ నాకే తెలుసు అనే పెద్ద బిల్డప్పు మీరు మీ…
ఈడ మనూరికి హంద్రీ నీవా కాలవ పనులు చెయిచ్చుయ్యా సామి… అపుడు కిష్నా నీళ్ళు మనోల్లకియ్యా సామి అంటే యాడికో ఎత్తకపోయి బాబు సారోల్లకు ఇచ్చినాడు అంట…
ఈడ రైతులు నీళ్ళు ల్యాక సస్సా ఉంటే ఆయప్ప ను ఓడగొట్టేదానికి కిష్ణా నీళ్లు మేం ఇచ్చినాం సూడు అని ఈయప్ప క్యాకలు పెడ్తాండడు.
ఇంట్లేకి నీళ్లు త్యాకుండా… పక్కింటోల్లకు బాయి తొగినా సూడు అన్నాడంట ఇట్టా ఆయప్ప ఎవరో ముందు…
ఈ ఊళ్ళో పనులు ఏట్లో ఏసేసి యాడి క్యాడికో పోయి గై గై మని ఎగుర్లాడతాండడు…
మనూరి కాడ ఉండ్లా హంద్రీ నీవా కాలువ… ఆ పని సేయిచ్చకుండా…
ఆడ యాంపల్లి కాన్నించి నీళ్లు ఎత్తి పోస్సాండ్ల అట్టా పాజెక్ట్ కడతాండ్రంట ప్పా…
ఐదేల కోట్లు ఖచ్చు పెత్తాడ్రంట
అదేదో సేప్తారు సూడు… అణా కోతి రూపాయి ముప్పవల బెల్లం తినిందంట… అట్టుంది మీ కాంతం సారు పని…
దాంట్లో గూడ మ్యాత బాగానే పడతాందంట లే…
పస్టు హంద్రీ నీవా కాలువ పని పూర్తి సేయమను…సీసేలం నించి కిష్ణా నీళ్ళు ఈడ ఓట్లేసిన జనానికి, రైతులకు ఈయమని సెప్పు… మళ్ళ సుద్ధాం…
వానలు పడి యలిగల్లు పాజెక్ట్ నిండినాక పాజెక్ట్ కు ఇబ్బంది ఉండగూడదని గేట్లు ఎత్తిన్యారు…
అది తప్ప రైతుల పంటల కోసం కాదు అది అందరికీ తెలుసులే…
అన్ని మాట్లు ఎత్తినాం, ఇన్ని మాట్లు ఎత్తినాం అనికాదు… ఇప్పుడు గూడ గేట్లు ఎత్తి రైతులకు నీళ్ళు ఇయ్యాలని అడుగుతానే ఉండారు…
కాలవొలు బూడిపోయినాయి రోంత తయారు సేయిచ్చండి అంటే పట్టిచ్చుకుంటే ఒట్టు…
బాబు సారు పెండ్లాము ఓళ్ళ ఊళ్ళో ఇంగ సారు బదులు నేను ఈ ఊళ్ళో ఎలచ్చన్లలో నిలబడతా అని…
ఆయమ్మ జనాల మధ్యలో నవ్వు కుండే దానికి అంటే… ఆమాట ఇంటానే ఊరోళ్ళంతా బాగా నవ్వుకున్యారు…
మీరేం పట్టిచ్చుకోద్దు… నేను జోక్ సేసిన అని సెప్తాంది అంతే…
ఈయప్ప కాంతం సారు… నేను ముందే చెప్లా… అని సంకలు గుద్దుకుంటా ఎగురుతాండడు..
సెంద్రం సారు కు ఓట్లు ఏయరని
అందుకే ఆయమ్మ ఇట్టా మాట్టాడతాందని ఎగేసుకొని సెప్తాండడు…
ఓ కాంతం సారూ… ఆ పెద్ద సారు మిందికి మల్ల పోదువు గానీ… రాసీటోల్లకు కాలువ పనులు తొందరగా సేయిచ్చు… కిష్ణా నీల్లు తెప్పిచ్చు… ఎలచ్చనలు అంటాండవు…
కాబట్టి సారూ నువ్వు ముందు పోయి టికెట్ తెచ్చుకో…
ఇపుడే ఓరికో టికెట్ అంటాండరు… సీటు ఇచ్చేది ల్యాకుంటే మాట్టాడే దానికి అవొకాశం గూడా ఉండదు కాంతం సారూ.
ఫట్టు పోయి మీ పెద్ద సారును కాకా… పట్టి టికెట్ తెచ్చుకో… మళ్ళ సుద్ధాం ఏమన్నా ఉంటే..
సరే… రేయ్… జాంబిగా పోయోస్సా … నాకు చ్యానా పనుంది…
సరెబ్బా …సాంబడు… పోయి రాపో… నీతో ఎందుకు… అన్ని కడిగి పారెస్సాండవు… తొందరగా పోరా సామి నువ్వు.. నాకు ఎత్తకచ్చి పెడ్తావు అన్ని…
– సముద్రవాణి
