తాజా వార్తలు

సైబరాబాద్ ప్రెస్ క్లబ్ లోగో ఆవిష్కరించిన సమాచార శాఖా మంత్రి పొంగులేటి

సైబరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కె.రాధాకృష్ణ

Share this :

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పాత్రికేయులు పని చేయాలని తెలంగాణ రెవెన్యూ మరియు సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో సైబరాబాద్ ప్రెస్ క్లబ్ (హైటెక్ సిటీ) లోగోను గురువారం మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. సైబరాబాద్ ప్రెస్‌క్లబ్ జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో సైబరాబాద్ ప్రెస్ క్లబ్ (హైటెక్ సిటీ) అధ్యక్షులు కె.రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు వై.విశ్వనాద్, కార్యదర్శి ఎం.కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ జి.ప్రభాకర్, ట్రెజరర్ కె.దుర్గాలక్ష్మి, సభ్యులు జి.రమణ బాబు, వి.దయానంద్, సతీష్, పి.లక్ష్మి, మురళి తో పాటు పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.