ప్రముఖ నటి సమంతా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా సమంతా, పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచినది. ఈ మూవీ విడుదలైన రెండు రోజులలోనే ఓవర్సిస్ లో కోట్ల రూపాయలు క్లబ్ లోనికి చేరిపోయినది. ప్రస్తుతం ఓవర్సిస్ లో ఖుషి దుమ్ము రేపుతుంది. అయితే ఇందులో సమంతా పాత్ర ఏమిటా..? అని ఆలోచన చేస్తున్నారా..? తాజాగా ఖుషి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది సమంతా.
అమెరికా దేశంలోని విడుదలైన ఖుషి సినిమాతో కలిపి వరుసగా 17 చిత్రాలు కూడా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడంతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు అయినది.ఖుషి హిట్ తో మంచి జోరు మీదున్నా ఈ అందాల భామ ప్రస్తుతం అమెరికా దేశంలో తన స్నేహితులతో కలసి సేదతీరుతుంది. ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
