తండ్రి అయిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా

Share this :

టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. బుమ్రా సతీమణి సంజన గణేశన్ నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాదు తన కుమారుడికి పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రసవ సమయంలో తన భార్య వద్ద ఉండేందుకు బూమ్రా స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో నేడు నేపాల్ తో జరగబోయే మ్యాచ్ కి బూమ్రా దూరం అయ్యాడు.

జస్ ప్రీత్ బుమ్రా – సంజన గణేశన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 2021 మార్చి 15న జరిగింది. తనకు కొడుకు పుట్టిన ఆనందాన్ని ఫ్యాన్స్ కి ఇన్ స్ట్రాలో పంచుకున్నాడు. ‘ఇక నుంచి మా చిన్న కుటుంబం పెరిగింది. నేటి ఉదయం మా ఇంటికి లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. ఇక నుంచి మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ పోస్ట్ చేశాడు. తన భార్య, చిన్నారి చేతిని పట్టుకున్న ఫోటోను బుమ్రా అభిమానులతో పంచుకున్నాడు. ఇక బుమ్రా తండ్రి కావడంతో తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సెప్టెంబర్ 10 నుంచి సూపర్ – 4 దశ మొదలు కాబోతుంది.. ఆ సమయానికి బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడని అంటున్నారు.