విరాట్ ఫాన్స్ కి దిమ్మతిరిగే జవాబిచ్చిన గౌతమ్ గంభీర్ !!

Share this :

సాధారణంగా  క్రీడాకారుల మధ్య తగాదాలు , గొడవలు సహజంగానే జరుగుతూ ఉంటాయి . కొన్ని సందర్భాలలో ఆ ఘటనలు చిలికి చిలికి గాలివానలా అవుతుంటాయి . కొన్ని గొడవలు సద్దుమణిగితే మరికొన్ని గొడవలు కొనసాగుతూనే ఉంటాయి . ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ మరియు గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం అందరికి తెలిసిందే . అయితే వారిద్దరి మధ్య జరిగిన ఆ గొడవ వారు లైట్ తీసుకున్నారు . కానీ విరాట్ , గంభీర్ ఫాన్స్ మాత్రం ఆ గొడవను ఇప్పుడల్లా వదిలేలా కనిపించడం లేదు .

సందు దొరికితే వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేసి వెలిగించేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో వీరి మధ్య జరిగే ప్రతి చిన్న విషయం పెద్ద ఎత్తున ఇష్యూ అవుతుంది.  ఇందులో భాగంగానే గంభీర్ కనబడితే కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు విరాట్ అభిమానులు . తాజాగా గంభీర్ గ్రౌండ్ నుండి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా విరాట్ ఫాన్స్ గంభీర్ ను టార్గెట్ చేసి బిగ్గరగా విరాట్ విరాట్ అని అరవడం మొదలు పెట్టారు .

ఇంకేముంది గంబీర్ కి  చిర్రెత్తుకొచ్చిన వారికీ గట్టి సమాధానమే చెప్పాడు . గంభీర్ తన మిడిల్ ఫింగర్ ను చూపిస్తూ వారికీ బుధ్ధి చెప్పాడు మరి ఇలా అయితే ఎలా భయ్యా .. ప్లేయర్స్ ప్లేయర్స్ మధ్య ఎన్నో తగాదాలు ఉంటాయి . వారి మధ్య ఉన్న ఆ గొడవను మరీ ఇంతలా పెద్దదిగా చేయాలా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .