ఎట్టకేలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం….!!

Share this :

తెలంగాణ ప్రభుత్వం నుండి డీఎస్సీ నిరుద్యోగులకు తీపి కబురు అందింది. ఈరోజు 5,089 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ తీసుకోనున్నారు.

నవంబర్ 20 నుంచి 30వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు కండక్ట్ చేయనున్నారు అని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికోసం పాత ఉమ్మడి జిల్లాల్లో ఎక్సమ్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తారు. పాఠశాల విద్యాశాఖలో 5, 089 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.అయితే దాంట్లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు 611 భాషా పండితులు మరియు 164 పీఈటీలను డీఎస్సీ ద్వారా పూర్తి చేయనున్నారు.

ఇంకోవైపు ఈనెల 15 తారీఖున తెలంగాణ టెట్ పరీక్ష కూడా జరగనుంది. ఈ టెట్ పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి అని అందరికి తెలిసిన సంగతే.అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-1 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు వాటిని కండక్ట్ చేస్తారు.ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. వాటి ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు అని టెట్ నోటిఫికేషన్ లో చెప్పారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. అయితే వాటికీ సంబంధించిన హాల్ టికెట్ ను రేపు (9/9/23) న వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.