టిడిపి అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడంపై వైసిపి మంత్రి రోజా తన స్టైల్ లో సమాధానము చెప్పారు.ఎవరు చేసిన తప్పులకి వారే కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని ఆమె సోషల్ మీడియా వేదికగా అన్నారు.కర్మ సిద్ధాంతం గూర్చి కూడా ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.అలాగే రోజతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఒక కరెక్ట్ వే లో ఆయన అరెస్ట్ కి గురి కాలేదని సోషల్ మీడియా వేదికగా ఆమె అంటే దానికి వెంటనే మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదో పురం దేశ్వరి గారు చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు.
ఆయన పై పెట్టిన కేసుకు సంబంధించి వివిధ సెక్షన్లను ఏలా ఉన్నాయో ఆమె వివరించారు. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న రోజా , సీఆర్పీసీ 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని అన్నారు.9/12/2021 న సిఐడి ఈఓడబ్ల్యూ వింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసారని కూడా అన్నారు.
120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ఐపీసీ సెక్షన్ 420 మోసం, చీటింగ్, నమ్మకద్రోహం,IPCసెక్షన్ 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసం, ఫోర్జరీ,471 నకిలీపత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలోని ఆస్థిని అక్రమంగా కట్టబెట్టడం 12,13(2) అవినీతికి పాల్పడటం, 13(1)(C)(D)పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడటం చేశారని పేర్కొన్నారు. అయితే విటన్నింటిని ఆధారం చేసుకొని ఆయనను అరెస్ట్ చేసారాని రోజా అన్నారు. అయితే విట న్నింటికి పురందేశ్వరి సమాధానం చెప్పాలని అన్నారు.మీ బావ గారి మీద ఉన్న మమకారంతో ఆయన చేసిన తప్పులు కనబడట్లేదు అని పురందరేశ్వరికి గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా.
