న్యాయానికి న్యాయమే జరుగుతుంది: ఎంపీ రఘురామకృష్ణంరాజు

Share this :

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో 14 రోజుల రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన అరెస్టు పై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో సహ పలువురు నేతలు చంద్రబాబు కి మద్దతు ఇస్తున్నారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మొదటి నుంచి చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తున్నారు.  గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యడ్యూరప్ప విషయంలో అలా.. చంద్రబాబు నాయుడు అంశంలో ఇలా ఎందుకని నిలదీశారు. ఇప్పుడు సీఐడీ  అధికారులు చంద్రబాబు నాయుడును రిమాండ్‌ కు ఇవ్వాలని అడుగుతున్నారని.. ఆధారాలు లేకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. తనకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. 

రాజమండ్రి జైల్లో దోమలు కుట్టి వీర వెంకట సత్యనారాయణ అనే ఖైదీ డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. తెదేపా అధినేత, ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడుకి రేపు ఏదైనా అపకారం జరిగితే మనల్ని కాపాడడానికి పోలీసులు, వారి ఆయుధాలు కూడా పనిచేయవు. కరోనా అంటించి గతంలో ఇదే పాలకులు కొందరిని చంపించిన దాఖలాలు ఉన్నాయి . ఇప్పుడు దోమలు కుట్టి చంద్రబాబు నాయుడు కి ఏదైనా అపకారం జరిగితే… ప్రజల నుంచి మన పార్టీ నాయకులను కాపాడే వారే లేరని అన్నారు రఘురామకృష్ణం రాజు. ముకుల్ రోహత్గి సిఐడి తరఫున వాదనలు వినిపిస్తూ, అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అప్లికబుల్ కాదని వాదించడం ఆశ్చర్యకరంగా ఉంది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఒక రూల్… చంద్రబాబు నాయుడు కి మరొక రూల్ ఉంటుందా? అని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. యడ్యూరప్ప పదవి కాలం ముగిసిన తర్వాతే ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి. యడ్యూరప్ప పదవి కాలం ముగిసిన తర్వాతే ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు నాయుడు పదవీకాలం ముగిసిన నాలుగున్నర ఏళ్ల అనంతరం ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కారణంతో భయపడి, మా పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్న ఉద్దేశంతో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అని అన్నారు. 

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే హైకోర్టు తీర్పు ఉంటుంది… శుక్రవారం చంద్రబాబు విడుదల ఖాయం అన్నారు. ఇక న్యాయానికి న్యాయమే జరుగుతుంది… మంచికి, సమాజ శ్రేయస్సుకు , చంద్రబాబు నాయుడుకి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని అన్నారు. సిబిఎస్ఈ సిలబస్ గాలికొదిలేసిన జగన్… ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ అంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ లో కూడా 17 A వర్తిస్తుందని అన్నారు. లోకేష్ ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడుతున్నారని. తండ్రి కష్టాల్లో ఉంటే కొడుకు ఆయను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. లోకేష్ పై కూడా ఏదో ఒక అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయాలనే నీచమైన ఆలోచనలో ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.