ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్…!!

Share this :

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజల బలం చేకూర్చుకోవడానికి పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.తాజాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికీ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అయితే ఈ నెల 8వ తేదీ వరకు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లోకాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉన్న పోస్టుల నియామకానికి సమయం పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

దాంట్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న పలు పోస్ట్లు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం పై ఒక సంవత్సరం కాల పరిమితి నియమించుటకు ధరఖాస్తులు తీస్కుంటామని చెప్పింది.దానికి అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు సబ్మిట్ చేయమని చెప్పింది.ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ కు చాలామంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మమ్మల్ని పేర్మినెంట్ చేస్తే బాగుంటుందని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.