నానీ నోరు అదుపులో పెట్టుకో లేదంటే చెప్పుదెబ్బలు ఖాయం: చింతకాయల అయ్యన్నపాత్రుడు

Share this :

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చలు జరుగుతున్నాయి. రోజు రోజుకీ చంద్రబాబు కి పెరిగిపోతున్న మద్దతు చూసి వైసీపీ నేతలు తమ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి నిజంగా ప్రజలమద్ధతు ఉంటే పోలీసులు, ప్రైవేట్ సైన్యం లేకుండా ఇప్పుడు పాదయాత్ర చేయగలడా? చంద్రబాబు, లోకేశ్ లేకుంటే టీడీపీ ఉండదని జగన్ పగటికలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే…నువ్వూ నీకు కాపుకాస్తున్న వ్యవస్థలు ఏవీ నిలవలేవని జగన్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు.

 కొడాలినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా లాంటి మాట్లాడే మాటలు జగన్ కే నచ్చుతాయని అన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయి. లోకేశ్ ను అడ్డుకుంటే జగన్ రెడ్డికి ప్రజలు ఘోరీ కడతారు. లారీలు క్లీన్ చేసుకు బతికేవాడు.. గుట్కాగాడు అయిన కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా లాంటి వైసీపీలో ఉండే కొందరు సన్నాసులు జగన్ రెడ్డి గురించి అతిగా స్పందిస్తూ, అతనికి తొత్తులుగా మారి ఏం మాట్లాడుతున్నా రో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడి లాంటి వ్యక్తి గురించి నేడు ప్రపంచమంతా మాట్లాడుతోంది అంటే దానికి కారణం ఆయన ఆలోచనలు, విజన్, పనితీరే అని అన్నారు.

వచ్చేవారం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తాననిచెప్పి, అనుమతులకు దరఖాస్తు చేస్తే, వెంటనే ఈ పిచ్చి నా డాష్ లకు రాజమహేంద్రవరం వంతెన మరమ్మతులు గుర్తొ చ్చాయి. యువగళం పాదయాత్ర రాజమహేంద్రవరం వంతెన పైనుంచి వెళ్లకూడదని ఇలా చేస్తారా? లోకేశ్ దెబ్బకు ఎందుకు భయపడుతున్నారు? ఇలాంటి పిచ్చిపనులు మానుకోకుంటే ప్రజలు మీకు శాశ్వతంగా ఘోరీ కడతారని తెలుసుకోండి. ప్రజలకోసం.. ప్రజా మద్ధతుతో జరిగే యువగళాన్ని ఆపితే ఈ ప్రభుత్వం తన గొయ్యి తాను తవ్వు కున్నట్టే.” అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.