వారానికి ఒకరోజైన అలాంటి ఆహారం తీసుకోవాలంటున్నా నిపుణులు….!!

Share this :

ప్రస్తుత సమాజంలో చాలా మంది వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం లేదని అందరికి తెలిసిన విషయమే. దాని వల్ల వారు హెల్త్ పరంగా అలాగే ఆర్థిక పరంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడమే. దానికోసం ప్రముఖ పోషకాహార నిపుణుడు అయినా మోనిక్ ర్యాన్ వారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు కంప్లీట్ గా శాఖాహారం వండుకొని తినాలని అంటున్నారు.అంటే వారానికి ఒకరోజైనా కంప్లీట్ గా శాఖాహారం తినడం చాలా అవసరం దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అందులో కొన్ని బరువును నియంత్రించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ అనేది తగ్గుతుంది. కనుక షుగర్ అదుపులో ఉంచుకోవడానికి కూరగాయలు, పండ్లు బాగా తినాలి. శాకాహార ఆహారాలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.దానివల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియఅనేది సాఫీగా జరుగుతుంది. జీర్ణక్రియ సాఫీగా ఉంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉటుందన్న విషయం తెలిసిందే. ఈ మద్య కాలంలో జంగ్ ఫుడ్ తో కోరుకొని మరీ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. 

మనకందరికి తెలిసిన విషయమే కానీ సహజం గా కొన్ని కారణల వల్ల దాని గూర్చి జాగ్రత్తగా వహించం.కూరగాయలు మరియు పండ్లలో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. కానీ మన ఎదుట మాంసాహారం ఉన్నప్పుడు శాఖాహారం యొక్క పోషక అంశాలను పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తాము. కావున వారంలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు కంప్లీట్ గా శాఖాహారం తీసుకునే విధంగా చూసుకోవాలి.