UP Cadre IAS Officer Abhishek Singh resigns from service: బాగా చదువుకుని అతిపెద్ద కొలువు సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. అందునా కష్టసాధ్యమైన సివిల్స్ సర్వీస్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీపడితే వేల మంది ముందుకెళ్తారు. దుర్భిణి వేసి మరీ మెరికల్లాంటి వారిని పదుల సంఖ్యలో ఎంపిక చేస్తారు. ఇక IAS, IPS లాంటి మూడక్షరాలు తమ పేరు ముందు చేర్చుకోవడానికి కఠోరశ్రమ చేయాల్సి వస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక సర్వీసుల కోసం ఏటా లక్షలాది మంది పోటీపడినా అంతిమ విజయం మాత్రం ఏ కొందరినో వరిస్తుంది. అలా సాధించుకున్న ఐఏఎస్ కొలువులో గర్వంగా, దర్పం ఒలకబోస్తూ హుందాగా కెరీలో ముందుకు సాగుతారు. అలాంటిది ఓ IAS ఆఫీసర్ మాత్రం కష్టపడి చదివి కొలువు దక్కించుకుని.. కేవలం సినిమాల కోసం ఆ కొలువును తృణప్రాయంగా వదులుకున్నాడు (resignation). ఈ అధికారి కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరంటే..

ఎవరీ అభిషేక్ సింగ్?
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ (IAS Abhishek Singh) గురించే మనం చర్చిస్తోంది. ఆయనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై మక్కువతో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన రాజీనామాను ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయిన ఢిల్లీ క్రైమ్ సీజన్- 2 (Delhi Crime Season 2 Web Series)లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది ఆయనే. ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు.
View this post on Instagram
చదువులో మేటి మాత్రమేకాదు గ్లామర్‌లో సినీతారలకు ఏ మాత్రం తగ్గని అందగాడు కూడా. అందుకే మంచి నటుడిగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఏ పాటితో ఆర్థం చేసుకోవచ్చు. Also Read: Minister Roja Fires on Offensive Comments: ‘బండారూ.. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేయడానికి నీ అర్హత ఏంటి? నువ్వా నన్ను ప్రశ్నించేది?’ మంత్రి రోజా ట్వీట్ వైరల్

అసలు కారణం అదేనా..?
ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో కొనసాగుతున్న క్రమంలో సినిమాలు, మోడలింగ్‌పై మక్కువతో తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో ఆయన సర్వీస్‌లో ఉండగానే పలు వివాదాలు ఎదుర్కొన్నారు.
2015లో యూపీ నుంచి డిప్యుటేషన్‌పై ఢిల్లీకి వెళ్లగా ఆ వ్యవధిని ఉన్నతాధికారులు మరో రెండేళ్లు పొడిగించారు. అయితే అభిషేక్ ఆ సమయంలో మెడికల్ లీవ్ తీసుకొని విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం 2020 మార్చిలో ఆయన్ను తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు పంపింది. అయినా కూడా వెంటనే విధుల్లో చేరకుండా ఎలాంటి కారణం చూపకుండానే 3 నెలల తర్వాత జూన్‌లో విధుల్లో చేరారు. అంతేకాకుండా గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరో వివాదంలో చిక్కుకున్నారు. తానే ఎన్నికల అధికారినని తెలుపుతూ తన ఫొటో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దం కావడంతో అది కాస్తా ఈసీ వరకు వెళ్లింది. దీంతో ఆయన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విధుల్లో నిర్లక్ష్యం చూపారని ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిషేక్ సస్పెండ్ చేశారు కూడా. ఇక అభిషేక్ భర్య శక్తి నాగ్‌పాల్ కూడా ఐఏఎస్ అధికారే. Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

కష్టకాలంలో అభిషేక్ సేవలు మరువలేనివి..
కొవిడ్ మహమ్మారి సమయంలో అభిషేక్ సేవలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం, ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చడం, వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించడం, సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చడం.. ఇలా ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మనిషి అనిపించుకున్నారు. అలాంటి సేవాదృక్పధం కలిగిన ఆయన హఠాత్తుగా తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం మారింది.

అభిషేక్ సింగ్ నటించిన సినిమాలు ఇవే..
అభిషేక్ సింగ్‌కు సినిమాలు, మోడలింగ్‌లో మక్కువ ఎక్కువ. ఆయన తొలిసారిగా ‘చార్ పండ్రా’ అనే షాట్ ఫిల్మ్‌లో నటించారు. ఈ సినిమాలోని ఓ పాటలో అభిషేక్ రొమాంటిక్ యాంగిల్ అద్భుతంగా పండించాడు. ఇక ప్రేమలో విఫలమైన ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచిన తీరు నటుడిగా మంచి మార్కులు కొట్టేసేలా చేశాయి. ఒక ఐఏఎస్ అధికారి నటుడిగా మెప్పించిన తీరు ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. ‘దిల్ తోడ్ కే.. ‘ ఈ పాట విడుదలైన 4 రోజులకే యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఆ పాటకు 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే అభిషేక్ సింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏపాటితో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Also Read: AP Elections 2024: ‘సీటు జారి గల్లంతైందే..’ వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుపై మల్లగుల్లాలు!
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.