హైదరాబాద్, అక్టోబర్ 10: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) సోమవారం (అక్టోబర్ 9) సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న శ్యామ్ సుందర్‌రెడ్డి (Dil Raju Father Passes away) ఆరోగ్యం విషమించి సోమవారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. ఆయనకు దిల్ రాజుతోపాటు మరో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో దిల్ రాజు తండ్రి మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ పై అలా స్పందించిన నటుడు నరేష్!
కాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ (Tollywood Producer) దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మువీస్ నిర్మించారు. చిన్నతనం నుంచే కుటుంబం అంతా రాజు అని పిలవడంతో రాజు అనే పేరు స్థిరపడిపోయింది. నితిన్ హీరోగా నటించిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది.

దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి, తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. ఆ తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.
