‘Yatra 2’ first look: ‘యాత్ర 2’ ఫ‌స్ట్ లుక్ వచ్చేసింది.. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..’

ఆసక్తికరంగా మారిన ఎమోషనల్ డైలాగ్‌

Share this :

‘Yatra 2’ first look out: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో డైరెక్టర్‌ మహివి రాఘవ్ (Mahi V Raghav) తెరకెక్కిస్తున్న మువీ ‘యాత్ర 2’ (Yatra 2). ఈ సినిమాలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) పాత్రలో మలయాళ సీనియర్‌ నటుడు మమ్ముట్టి (Mammootty) నటిస్తున్నారు. ఇక రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాత్రలో కోలీవుడ్‌ హీరో జీవా (Kollywood Hero Jiiva) నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ (Yatra 2 first look)ను చిత్ర యూనిట్ సోమవారం (అక్టోబర్ 9) విడుదల చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది.

Also Read: Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం.. అప్పుడు భార్య ఇప్పుడు..

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి… నేను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. పోస్ట‌ర్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది.

ఏపీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రం 2019 ఫిబ్రవరి 8న విడుదలైన సంగతి తెలిసిందే. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా వైఎస్‌ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెర‌కెక్కిస్తున్నారు.

Also Read: Ticket Tension to YSRCP MLA’s: వైసీపీ ఎమ్మెల్యేలలో టిక్కెట్ల టెన్షన్.. ఈసారి వస్తుందో? రాదో?

అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నట్లు సమాచారం. 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మువీ షూటింగ్‌ పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా మధి, సంగీతం సంతోష్‌ నారాయణన్ అందిస్తున్నారు.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.