కాకినాడ, అక్టోబర్ 13: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు గురించి కాకినాడ జిల్లా (Kakinada District) సామర్లకోటలో జరిగిన బహిరంగ సభ (CM Jagan) లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సెటైర్లు వేయడాన్ని రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లికి, రాష్ట్ర రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెళ్లిళ్ల విషయాన్ని పదేపదే జగన్‌మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రస్తావించడం వెనుక ఏదో ఉద్దేశ్యం ఉందని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. జగన్‌మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ లాగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నారా? అని వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
Also Read: Snake in Nutrition Kit: అంగన్‌వాడీల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంలో పాము కళేబరం..
గురువారం సామర్లకోటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జనసేనని (JanaSena Party) పవన్ కళ్యాణ్ మీద భారీగా విమర్శలు గుప్పించారు. ఆయన ప్యాకేజీ స్టార్ అన్నారు. గంపగుత్తగా పార్టీని, క్యాడర్‌ను తెలుగుదేశం పార్టీకి అమ్ముకున్నారని ఆరోపించారు. అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుతారని తెలిపారు. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి కూడా పట్టించుకోవడం లేదన్నారు. సినిమాకు-సినిమాకు షూటింగ్ మధ్యలో వచ్చిన గ్యాప్‌లో రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా వేశారు. సరుకులు అమ్ముకున్నట్టు పార్టీని మొత్తాన్ని అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూశారు. పవన్ కళ్యాణ్ ఇల్లు హైదరాబాదులో ఉంటుందని అందులో భార్యలు మాత్రం మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటారని సెటైర్లు వేశారు. ఒకరు లోకల్ అని, ఇంకొకరు నేషనల్ అని, ఇంకొకరు ఇంటర్నేషనల్ అని వివరించారు. ఇంకొకసారి ఎక్కడికి వెళ్తారో తెలియదని అన్నారు. ఇక సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. రాజకీయాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి మాట్లాడితే బాగుంటుందని, వ్యక్తిగత విషయాలు ప్రస్తావనకు తేవడం మంచిది కాదని అంటున్నారు. రాజకీయాలలో కొన్ని నైతిక విలువలు ఉన్నాయని, వాటికి కట్టుబడి ఉండాలని పేర్కొంటున్నారు. జగన్‌మోహన్ రెడ్డి కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆశ ఉంటే భార్య భారతిని ఒప్పించి చేసుకోవచ్చని అంటున్నారు.
Also Read: ‘Yatra 2’ first look: ‘యాత్ర 2’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..’
జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను విమర్శించే ముందు జగన్‌మోహన్ రెడ్డి తమ కుటుంబ వ్యవహారాలను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేలు పవన్ కళ్యాణ్ వైపు చూపిస్తే, మూడు వేళ్ళు మీ వైపే కదా చూసిస్తాయని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్ కుటుంబానికి సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతుంది. తల్లి విజయమ్మ పార్టీలోకి రారు.. చెల్లి షర్మిల ఇంటికి రారు.. భార్య భారతి గుడికి రారు.. అని నెటిజెన్లు జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్ ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ముందు తల్లితో, చెల్లితో సఖ్యతగా ఉండాలని, తర్వాత నీతులు చెపితే బాగుంటుందని అంటున్నారు. జగన్‌మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని చెల్లి షర్మిల పాదయాత్ర చేశారు. తల్లి విజయమ్మ ప్రచార బాధ్యతలను నిర్వహించారు. ఇష్టం లేకపోయినా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటువంటి తల్లిని, చెల్లిని పక్కనపెట్టి, వారికి ఆస్తిలో ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న జగన్‌మోహన్ రెడ్డి ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి (TDP leader NB Sudhakar Reddy) ఘాటుగా స్పందించారు. ‘అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు వడ్డానం చేయిస్తానన్నాడట’ అనే సామెత తండ్రి రాజశేఖర్ రెడ్డి తరచుగా అనేవాడని పేర్కొన్నారు. ఆ సామెత ప్రస్తుతం జగన్ కు అతికినట్లు సరిపోతుందని ఎంబీ సుధాకర్ రెడ్డి ఎద్దేవా వేశారు. తల్లిని, చెల్లిని ఇంటికి పిలిచి పండగ పూట భోజనం పెట్టి, చీర జాకెట్ కూడా పెట్టని జగన్ మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అలాగే హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం గుడికి వెళ్లాలన్న, పూజలు చేయాలన్న భార్య పక్కన ఉండాలని, అయితే జగన్ భార్య భారతి ఎందుకు తనను అనుసరించడం లేదని ప్రశ్నించారు. ముందు ఇల్లు చక్కదిద్దుకోవాల్సిందిగా జగన్ కు సుధాకర్ రెడ్డి సలహా ఇచ్చారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
