Bhagavanth Kesari Director: ‘అది మా తప్పే.. సారీ!’ క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అనిల్‌ రావిపూడి.. ఎందుకంటే

'మీ సునిశీత పరిశీలన, సూక్ష్మ బుద్దికి హ్యాట్సాఫ్.. అది నిజంగా చాలా గొప్ప విషయం'

Share this :

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ప్రథానపాత్రలో నటించిన తాజా మువీ ‘భగవంత్ కేసరి (Bhagavanth Kesari)’. అనిలో రావిపూడి (Director Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీ భారీ అంచనాల నడుమ గురువారం (అక్టోబర్ 19) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు బాక్సాఫీస్‌ వద్ద ఈ మువీ బాగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ మువీ మరీ అంత సూపర్ అని చెప్పలేకపోయినా.. పర్లేదు అనేలా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మువీలో తండ్రీ కూతుళ్లుగా బాలయ్య, శ్రీలీల (Sreeleela) యాక్టింగ్ బాగుందని ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. తొలిరోజు రూ.30 కోట్లకుపైగానే గ్రాస్‌ రావడంతో ‘భగవంత్ కేసరి’ చిత్ర బృందం శుక్రవారం సక్సెస్‌ మీట్‌ (Bhagwant Kesari Success Meet) ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడిని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.

Also Read: Wife Sold Her Husband: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను రూ. 5 లక్షలకు వేరే మహిళకు అమ్మేసిన భార్య

అసలింతకీ ఏం జరిగిందంటే..

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పోలీస్ అధికారి, ఖైదీ పాత్రల్లో కనిపించగా.. ఆయన పెంపుడు కూతురు పాత్రలో శ్రీలీల నటించింది. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలు చేసిన శ్రీలీల ఈ సినిమాలో సెటిల్డ్‌గా యాక్ట్ చేసింది. ఎమోషన్స్ సీన్స్‌, యాక్షన్ సీన్స్‌లో శ్రీలీల నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మువీలో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర తండ్రిగా శరత్ కుమార్ కొన్ని నిమిషాలపాటు తెరపై కనిపించారు. ఆయన సినిమాలో జైలర్‌ పాత్ర పోషించారు. కానీ కథలో భాగంగా ఆయన చనిపోయారని టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పినప్పుడు సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ మీడియా మిత్రుడు అనిల్ రావిపూడిని అడిగారు.

అనిల్ రావిపూడి సమాధానం ఇదే..

అంత పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం నిజంగా గొప్ప విషయం. మీ సునిశీత పరిశీలన, సూక్ష్మ బుద్దికి హ్యాట్సాఫ్. ఏది ఏమైనా జైలర్‌ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పిదం వల్లే జరిగింది. మా టీం పొరపాటు వల్ల అలా జరిగింది. అందుకు క్షమాపణలు చెబుతున్నా. చిన్నదైనా తప్పు తప్పే కాబట్టి (Mistakes in Bhagavanth Kesari Movie) నిజయితీగా ఒప్పుకోవాలి’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

Also Read: Actress Shruti Haasan in Politics: రాజకీయాల్లోకి స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ? మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

ఇకపోతే సినిమా బ్లాక్‌బస్టర్ అంటున్నా తొలిరోజు వసూళ్లలో మెగస్టార్‌ చిరంజీవి ‘భోళా శంకర్’ని బాలయ్య దాటలేకపోవడం ఆశ్చర్యపరిచింది. ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే మునుముందు ఈ సినిమా మరింత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని దర్శకుడు అనిల్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేసిన తనకు ఈ సినిమా పూర్తి సంతృప్తిని ఇచ్చిందని అనిల్‌ చెప్పారు. మువీలోని తండ్రీకూతుళ్ళ ఎమోషన్స్‌ వల్లనే మువీ సక్సెస్‌ అయ్యింది. ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారన్నారని అనిలో ఈ కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేశారు. కాగా ‘భగవంత్ కేసరి’ మువీలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు.