Actress Amala Paul Second wedding: దక్షిణాది స్టార్ హీరోయిన్ అమలాపాల్ (Actress Amala Paul) పరిచయం అక్కరలేని పేరు. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ (Tollywood)లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అమలాపాల్. ఈ మలయాళ భామ హీరో రామ్ చరణ్ (RAm Charan) మూవీ నాయక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా అజయ్ దేవగణ్ (Ajay Devgn) నటించిన ‘భోళా (Bholaa)’ చిత్రంలో అమలాపాల్ నటించింది. గురువారం (అక్టోబర్ 26) ఈ కేరళ కుట్టి 32వ పుట్టిన రోజు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలో ప్రియుడు జగత్ దేశాయ్ (Director AL Vijay)తో కలిసి పెళ్లి పీటలెక్కనుంది. ప్రియుడితో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ రోజు అధికారికంగా వెల్లడించింది.
ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతా (Amala Paul Instagram)లో షేర్ చేసిన అమలాపాల్, జగత్ (Jagat Desai Amala Paul) కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Socail Media)లో తెగ వైరలవుతోంది. ఓ ఫ్యాన్సీ కేఫ్‌లో డ్యాన్స్ చేసిన తర్వాత జగత్ .. అమలాపాల్‌ను స్టేజ్ మీదికి తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చుని రోమాంటిక్‌గా ‘విల్ యు మ్యారీ మీ..’ అని ప్రపోజ్ చేస్తాడు. అనంతరం అమలాపాల్ ‘యస్..’ చెప్పేస్తుంది.
View this post on Instagram
అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ‘నా జిప్సీ క్వీన్ యస్ చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్’ అని జగత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Also Read: Bogus Calculations on YSR Death: ‘మీది తప్పుడు లెక్కని ఒప్పుకోండి.. టీడీపీదే అసలు లెక్క’ ఎంపీ రఘురామ కృష్ణంరాజు
View this post on Instagram
పెళ్లైన మూడేళ్లకే మొదటి భర్తకు విడాకులు..
అమలాపాల్‌కు ఇది రెండో పెళ్లి. గతంలో (2014) డైరెక్టర్ ఏఎల్ విజయ్ (Director AL Vijay)ను పెళ్లాడిన అమలాపాల్.. మూడేళ్లకే అంటే 2016లో విడిపోయారు. ఆ తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అమలాపాల్ 2009లో మలయాళ చిత్రం ‘నీలతామరా’ మూవీతో అరంగెట్రం చేసింది. 2010లో తమిళలో విడుదలైన ‘మైనా’తో మంచి గుర్తింపు దక్కించుకుంది. అమలాపాల్ హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఆడుజీవితం, ద్విజ అనే రెండు మలయాళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
Also Read: Gautami Tadimalla Resigns BJP: తమిళనాడు బీజేపీకి వరుస షాక్‌లు.. పార్టీని వీడుతోన్న సినీ గ్లామర్!

4 Comments
Comments are closed.