రాజంపేట, నవంబర్ 6: ఎన్నికలు సమీపిస్తున్న (AP Elections 2024) వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradeh) రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాజంపేట (Rajampet) తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)నేత బత్యాల చంగల్రాయుడు (TDP Bathyala Changalrayudu) టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్న బత్యాల (Bathyala Changalrayudu) అతిత్వరలో టీడీపీ (TDP)ని వీడి వైసీపీ గూటికి చేరుతున్నారనేది ఆ వార్తల సారాంశం. దీనిపై తాజాగా మార్క్ టీవీ (Mark TV)తో మాట్లాడుతూ బత్యాల చంగల్రాయుడు వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
‘ప్రత్యర్ధుల ఆరోపణలు నమ్మొద్దు. వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. పార్టీ మారాల్సి వస్తే రాజకీయాలు (AP Politics) మానేస్తాను. అంతేగానీ వేరే పార్టీకి మారే ఉద్దేశ్యం లేదు. టీడీపీ నుంచి బరిలో ఉంటున్నాను. సామాజిక మాద్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం’ అంటూ వైసీపీలోకి మారుతున్నారనే వార్తలను బత్యాల ఖండించారు.
ఇంకా ఆయన ఈ విధంగా మాట్లాడారు.. ‘అధిష్టాన పార్టీ నా పట్ల సుముఖంగా ఉంది. వైపీసీ (YSRCP)ని తప్పక ఓడిస్తాను. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అధిష్టానంకి అన్నీ తెలుసు. కుట్ర కుతంత్రాలు నన్నేమీ చేయలేవు. ప్రజలతోనే గత 40 ఏళ్లుగా మమేకమై ఉన్నాను. ఎన్నికల సమయంలో ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తుంటారని’ ఈ మేరకు ఆయన మార్క్ టీవీతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
Also Read: TDP Buchiram Prasad: ‘పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వైపీసీ మంత్రులు రాజకీయ కేంద్రంగా మారుస్తున్నారు’
కాగా రాజంపేట టీడీపీ నేత బత్యాల ఇటీవల రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని తిరుపతి ఎయిర్ పోర్ట్‌లో కలిసి పార్టీ మార్పు విషయమై ఆయన మాటామంతి కలిపినట్లు, ఈ విషయమై తరచూ ఎంపీ మిథున్ రెడ్డి (MP Midhun Reddy)తో టచ్‌లో ఉంటున్నట్లు గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాగే త్వరలో పార్టీ మారాలనుకుంటున్న ఆయన ఎమ్మెల్యే (MLA)టికెట్ చేజెక్కించుకుంటాడా? లేదా అనే విషయం కూడా రాజంపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో బత్యాల మీడియాతో మాట్లాడుతూ అవన్నీ పూర్తిగా అవాస్తవాలంటూ కొట్టిపారేశారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.