అమరావతి, నవంబర్ 7: టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Bail) బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతున్న కొంత మంది చెట్టు కింద న్యాయవాదులు, ముందు షరతులను ఉల్లంఘించిన సీఎం జగన్ (CM Jagan) బెయిల్‌ను ఏమి చేయాలో చెప్పాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghu Rama Krishna Raju) డిమాండ్ చేశారు. ఏపీ (Andhra Pradesh) సీఎం జగన్ బెయిల్ (CM Jagan Bail)షరతులను ఉల్లంఘించడమే కాకుండా, ఎంతోమందిని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు. బెయిల్ రద్దు చేయమని కేసు వేసిన నాలాంటి వారిని చంపాలని చూశారన్నది నిజం. కోర్టుకు విచారణకు హాజరు కావడం లేదనేది నిజం. కోర్టుకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు చేయాలని కోర్టు షరతు విధించిన మాట నిజం. ఏ నిజాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నది నిజం. ఈ నిజాలన్నింటినీ ప్రజా కోర్టు ముందు ఉంచుతున్నాను. ప్రజలే న్యాయ నిర్ణేతలని ఎంపీ రఘురామ సోమవారం (నవంబర్ 6) రచ్చబండ (MP Raghu Rama Krishna Raju Rachabanda)కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
సాక్షి న్యూస్ పేపర్‌లో వైకాపా పార్టీకి (AP Politics) చెందినవారు, చెట్టు కింద ప్లీడర్ల అభిప్రాయాలను తీసుకుని ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయాలన్నట్టుగా ప్రచురించడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆయన బెయిల్ షరతులను ఉల్లంగించారని సాక్షి బఫూన్స్ అంతా కలిసి న్యాయవ్యవస్థను ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లుగా పెన్ డ్రైవ్ ద్వారా సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం, ఆయన ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రోడ్డుమీద ఎవరైనా మహానుభావులు వస్తే, ప్రజలు రోడ్డు మీదకు వారిని చూసేందుకు రావడం ఖాయం. వైసీపీ నేతలైతే డబ్బులు ఇచ్చి జనాలను తీసుకువస్తేగానీ జనసందోహం కనిపించదు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు తిలకించడానికి జనం వస్తే, న్యాయ మూర్తులు ఏమి చేస్తారని ప్రశ్నించారు.
Also Read: TDP Buchiram Prasad: ‘పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వైపీసీ మంత్రులు రాజకీయ కేంద్రంగా మారుస్తున్నారు’
సీఎం జగన్ ఇప్పటి వరకు 3,017 సార్లు కోర్టుకు హాజరుకాలేదు.. మరి ఆయన సంగతేంటి?
అనారోగ్యం కారణంగా బెయిల్ వచ్చిందని కొందరు మాజీ మంత్రులు వ్యాఖ్యానించారు. మరి మీకు ఏ రోగం వచ్చిందని సాక్షి దినపత్రికలో ఇటువంటి చెత్త రాతలను రాస్తున్నారు. కండిషన్లను ఉల్లంఘించిన కారణంగా చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఎవరైతే చెట్టు కింద ప్లీడర్లు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారో, జగన్ ఇచ్చిన బెయిల్ కండిషన్లలో ఒకటైన తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలనే కండిషన్ కోర్టు విధించింది. కానీ జగన్ ఇప్పటి వరకు 3,017 సార్లు కోర్టుకు హాజరు కాకుండా వాయిదా కోరారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశాను. అత్యవసరమైతేనే కోర్టు విచారణ జగన్‌ను పిలవాలని ఆరు నెలల క్రితం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంతకుముందు ఆయన ఎన్నిసార్లు పిలిచినా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అప్పుడే అతని బెయిల్ రద్దు చేయాల్సిందని రఘురామ అన్నారు. బెయిల్ రద్దు చేయలేదంటే CID కోర్టును మేనేజ్ చేశారా? అని మేము అనవచ్చా?? అంటూ నిలదీశారు.
Also Read: TDP Bathyala Changal Rayudu: టీడీపీ నేత అచ్చెనాయుడుతో బత్యాల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
చంద్రబాబును ఎప్పుడు విచారణకు పిలిచినా, ఏసీబీ కోర్టు (ACB Court)కు హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్ తరహాలో వాయిదా కోరలేదన్నారు. కోర్టు విచారణకు హాజరుకాకుండా ఎన్నోసార్లు గైరాజరైనా జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేయలేదన్నారు. సాక్షులను ప్రభావితం చేయవద్దని బెయిల్ కండిషన్లలో పేర్కొన్నప్పటికీ, అన్ని కేసులలో A2 నిందితుడైన విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇంకొక కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఆంధ్రకు తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నారు.
సీబీఐ కోర్టులో దారుణం జరుగుతోంది..
జగన్‌పై సీబీఐ అభియోగాలను మోపి చార్జిషీట్లను దాఖలు చేసింది. పదేళ్లుగా 11 చార్జి సీట్లలో ఉన్న 100 మంది వ్యక్తులు, డిశ్చార్జ్ పిటిషన్లను వేస్తుండడం వల్ల ఇప్పటివరకు ట్రయల్ కూడా మొదలు కాలేదు. డిశ్చార్జి పిటిషన్ పూర్తి అయ్యే వరకు కేస్ పెండింగ్‌లో ఉంటుంది. చట్టంలోని లోసుగులను వాడుకొని పదేళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ, కాలయాపన చేస్తున్నారు. దీనితో ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి. 11 చార్జిషీట్ కేసులలో A1 నిందితుడిగా ఉన్న జగన్ నేరం ఒప్పుకుంటారా? లేదా?? అన్నది తేలిన తర్వాతే ట్రయల్ ప్రారంభమవుతుందన్నారు. సీబీఐ తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాదిగా జగన్ తరపున, నిరంజన్ రెడ్డి , మరొకరో కేసును వాదిస్తూ ఉండవచ్చు. వాదనలు జరగాలంటే ఇంకో పదేళ్ల సమయం పట్టవచ్చు. దీనికి అంతం ఏప్పుడో ? సీబీఐ కోర్టులో దారుణం జరుగుతోందని నేను సుప్రీంకోర్టు (Supreme Court) దృష్టికి తీసుకు వెళ్లాను. హైకోర్టు కూడా సీఎం జగన్‌ను అత్యవసరమైతేనే విచారణకు పిలవాలని వెలువరించిన నేపథ్యంలో కోర్టు మారుస్తారా? త్వరగా విచారణ పూర్తి చేయమని ఆదేశిస్తారా? లేకపోతే బెయిల్ క్యాన్సిల్ చేస్తారా? అన్నది చూడాలన్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ బెయిల్ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన చంద్రబాబు తిలకించడానికి జనం వస్తే, న్యాయమూర్తులు మాత్రం ఏం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి.
