TV9 Vs Mahasena Media హైదరాబాద్, నవంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో మహాసేన యూట్యూబ్ ఛానెల్ (Mahasena YouTube Channel) నడుపుతున్న రాజేష్‌పై తాజాగా టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ (TV9 Executive Editor Rajini Kanth) హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ (Cyber Crime) ఎస్ఐ మహాసేన (Mahasena Media) రాజేష్‌కు ఫోన్ చేశారు. రాజేశ్ తన యూట్యూబ్ (Mahasena) ఛానెల్లో రజనీకాంత్‌పై వల్గర్‌గా వీడియోలు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ ఆయన కేసు పెట్టారని ఎస్ఐ ఫోన్లో తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి నోటీస్‌లు తీసుకెళ్లాలని రాజేశ్‌కు సూచించారు. ఇందుకు సంబంధించిన ఆడియో విజువల్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీనిపై తెలుగుదేశం పార్టీ (TDP) ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు (TDP SC Cell President MS Raju) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘గౌరవనీయులైన టీవీ9 (TV9) ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్.. మా మహాసేన రాజేష్ (Mahasena Rajesh)పై సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారట! మీ జ్ఞానంతో దిశ పోలీసులకి ఫిర్యాదు చేయలేదు సంతోషం. టీడీపీపైన నువ్వు, నీ ఛానల్ చేసిన విషప్రచారంపై మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు. నీ తప్పులు మేము ఎత్తి చూపడం మొదలుపెడితే ఇన్సులిన్ డోసూ వర్కవుట్ అవ్వదు. నువ్వు మా తెలుగుదేశం జోలికి వచ్చావు. మా లీడర్లు, కేడర్ని కెలుకుతూ ఉన్నావు. మహాసేన రాజేష్ పై కేసులు బనాయించి అరెస్ట్ చేయించాలని చూస్తున్నావు. నువ్వు ప్రజల కోసం పోరాడుతున్న తెలుగుదేశం (TDP)పైకి వస్తున్నావు. అంటే మీ యజమాని లాగే ప్రజలపై దండయాత్ర చేస్తున్నావు. మేము రెడీ. నీ ఆటో స్పై, పోస్కో అజ్ఞానం.. నీ అవినీతిపై మేమూ కేసులు పెడతాం. కాసుకో.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇది మంచి పరిణామమే..
కాగా ఇది మంచి పరిణామం అంటున్నారు సామాజిక వేత్తలు. మీడియా స్వేచ్ఛ పేరుతో ఏదోవిధంగా వార్తలు వండి వాడ్చేస్తుంటుంది. వాస్తవం, అవాస్తం తెలియకుండా ఇతరులపై ఆరోణలు చేస్తుంటుంది. సరైనా సాక్ష్యాధారాలు లేకుండా వ్యక్తులపై, వ్యవస్థలపై మీడియా ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తుంటుంది. తాజా పరిణామంతో ఇటువంటి ట్రెండ్‌కు బ్రేక్ పడినట్లైంది. ఎప్పుడైతే టీవీ9 రజనీకాంత్ అతిచిన్న యూట్యూబ్ ఛానెల్‌పై కేసుపెట్టారో.. ఇకపై భవిష్యత్తులో టీవీ9 (TV9)పై మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా, వ్యక్తుల పరపతిని కించపరిచే విధంగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియాలో ప్రసారం చేస్తే వారూ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఎవరి పేరైతే వాడుతూ మీడియాలో వార్తా కథనాలు ప్రసారం చేస్తారో వారు కూడా రజనీకాంత్‌పై కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ సంప్రదాయం ఒక్క టీవీ9కి మాత్రమే కాదు అన్నీ మీడియా సంస్థలకు వర్తిస్తుంది. మీడియా (Media)కు స్వేచ్ఛ ఉన్నట్లే ప్రజలకు కూడా స్వేచ్ఛ ఉంటుందనే విషయం ఈ సంఘటనతో తేలిపోయింది. దీంతో న్యూస్ కథనాల్లో ఏవైనా ఊహాజనితమైనటువంటివి ప్రసారం చేస్తే ప్రజలు మీడియా ఛానెల్స్ (Media Channels)పై కేసులు పెట్టే అవకాశం ఉంది.
మీడియాకు నేరుగా వ్యక్తులపై, సంస్థలపై ఇష్టారీతిగా సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేసే హక్కు లేదు. పక్కా ఆధారాలు ఉండాలి. లేదంటే వేరే ఎవరైనా ఆరోపించినట్లు, విమర్శించినట్లు విజువల్స్ గానీ, ప్రెస్ రిలీజ్ గానీ ఎవిడెన్స్‌గా ఉండాలి. అందుకే ఇది మంచి పరిణామం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీడియా కూడా తన పరిధి ఏమిటనే విషయంపై దృష్టి పెట్టాలి. గతంలో మేం ఏం ప్రసారం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు అనే రీతిలో కొన్ని మెయిన్ స్ట్రీం ఛానెల్స్ విజృంభించేవి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. అటువంటి వార్తాకథనాలు ఏవైనా ప్రసారం చేస్తే పరువునష్టం కేసులు, ఇతరత్రా ఫిర్యాదులు మీడియా సంస్థలపై పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీడియా సంస్థలపై కొన్ని లక్షల కేసులు నమోదు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.. వంటి పలువురి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్లో చొరబడి మరీ వార్తలు వండి వార్చేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. ఇలాంటివి జరిగితే నేరుగా చట్టపరంగా యుద్ధానికి దిగనున్నారు. కాబట్టి మీడియా సంస్థలు కూడా ఒక పరిధిని నిర్ణయించుకోవడం ఉత్తమం.
ఇక మహాసేన యూట్యూబ్ ఛానెల్ యజమాని రాజేశ్ (TV9 Vs Mahasena Media)పై టీవీ9 రజనీకాంత్ (TV9 Rajini kanth) కంప్లైట్ ఇచ్చారు. కాబట్టి రేపు పబ్లిక్ కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. తమను కించ పరిచేలా వార్తా కథనాలు వస్తే ఇకపై ఎవరైనా కంప్లైట్ చేయొచ్చనే విషయం వారికీ బోధపడింది. అయితే జాతీయ మీడియా అయిన టీవీ9 చిన్న యూట్యూబ్ ఛానెల్‌పై కంప్లైంట్ ఇవ్వడం తీవ్ర దుమారం లేపుతోంది. టీవీ9 స్థాయి తగ్గించుకున్నట్టా లేదా యూట్యూబ్ ఛానెల్ (Mahasena Media)కి బెదిరినట్టా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా ఫిర్యాదులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఏ వార్తాకథనం ప్రచురించే అవకాశం ఉండదు. వ్యక్తులపై అనుమానం, కించపరచడం, వారి స్థాయి సమాజంలో దిగజార్చే కథనాలకు చెల్లు చీటి పడినట్లే. ఏవైనా ఆధారాలతో వార్తలు రాస్తే సరి.. లేదంటే ఇదిగో ఇలా కేసులు పెట్టుకుంటూ పోతారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.