అమరావతి, నవంబర్ 11: తెలుగు దేశం (TDP)పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా (Telugu Desam Party Twitter)లో తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో తీవ్ర చర్చకు దారి తీసింది. తరచూ ‘వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా’ అని టీడీపీ (TDP) ప్రచారం చేయడం ఎన్నో సార్లు వార్తాకథనాల్లో, ఊకదండపుడు ఉపన్యాసాల్లో మనం విన్నాం. ఆయా మీడియా సంస్థలన్నీ వైఎస్ఆర్సీపీ (YSRCP)కి ఊడిగం చేస్తున్నాయంటూ ఎన్నోసార్లు టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు కూడా.
అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మీడియా సంస్థలన్నింటినీ ఓ బ్యాగ్‌లో సర్దేసి వైఎస్ఆర్సీపీ షాపింగ్ బ్యాగ్ పేరిట ‘బిగ్ దీవాళీ సేల్’ (YSRCP Diwali Shopping Bag) అనే ఫొటోను తెలుగు దేశం పార్టీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. దానికి బాయ్‌కాట్ టీవీ9, ఎన్టీవీ (#BoycottTV9NTV), దర్టీ గ్యాంగ్ (#DirtyJGang) అనే హ్యాష్ ట్యాగ్‌లతో ‘ఒక్కొక్క ఛానెల్ రూ.6093 చొప్పున 420 శాతం తగ్గింపుపై కొనుగోలు చేయబడింది’ అనే క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ పోస్టుకాస్తా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టు గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సదరు ‘బిగ్ దీవాళీ సేల్’ (Big Diwali Sale Shopping Bag) షాపింగ్ బ్యాగ్‌లో జాతీయ మీడియా సంస్థలతోపాటు యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఉన్నాయి. ఈ మీడియా సంస్థలన్నింటినీ ఒకేతాటికి కట్టి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. అయితే బంపర్ ఆఫర్లో అమ్ముడు పోయినట్లు ఈ మీడియా సంస్థలపై ఇంతటి ప్రచారం జరుగుతోన్నా.. ఆ మీడియా సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉన్నాయి. ‘మా మీద అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారని’ కనీసం ఖండించక పోవడం కొసమెరుపు. ఇలా ప్రచారం చేస్తూనే ఉంటే.. దీనికి పుల్‌స్టాప్ ఉంటదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
Bought on 420% discount at INR 6093 each#BoycottTV9NTV#DirtyJGang pic.twitter.com/SLMOnZoPBU
— Telugu Desam Party (@JaiTDP) November 10, 2023
అన్ని విషయాల గురించి ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలు వండివడ్డించే ఆయా మీడియా సంస్థలు ఎందుకు తమపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. టీడీపీ పోస్టు చేసిన వైఎస్ఆర్సీపీ దీవాళి సేల్ షాపింగ్ బ్యాగ్ (YSRCP Big Diwali Sale Shopping Bag)లో ‘సాక్షి’ (Sakshi) ఎందుకు లేదు? అనేది కొత్త అనుమానాలకు తావిస్తోంది. అదే బ్యాగ్‌లో యూట్యూబ్ చానెళ్లు, సాటిలైట్ చానళ్లు కూడా ఉన్నాయి. కానీ సాక్షిలేదు. ఈ రహస్యం ఎంటో టీడీపీ (TDP)కే తెలియాలి. తామంతా వైసీపీకే అనుకూలం అని చెప్పేయాలి.. లేదంటే కాదని ఖండించాలి. లేదంటే బయటికి వచ్చి మేము న్యూట్రల్ అని చెప్పాలి. అంతేగానీ దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అదంతా నిజమేనని, టీడీపీ వ్యాఖ్యలు వాస్తవం అని ప్రజలు భావించే అవకాశం ఉంది.
అన్ని సమస్యల మీద స్పందించేటప్పుడు మీ సమస్యల మీద మీరెందుకు స్పందించట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు న్యాయపరంగా ఈ ప్రచారాలపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఏ ప్రయత్నం చేయకుండా, ప్రచారాన్ని అడ్డుకోకపోవడం వల్ల ప్రజలు ‘అదే నిజం’ అని నమ్ముతారు. తమపై జరుగున్న ప్రచారం నిజమేనని క్లారిటీ ఇస్తే ఈ ప్రచారానికి ముగింపు దొరికినట్లవుతుంది కదా .. ఎన్నాళ్లీ ముసుగులో గుద్దులాటలు అంటూ ప్రజానీకం హితవుపలుకుతున్నారు. చట్టపరంగా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా ప్రచారం అగడం లేదంటే వైఎస్ఆర్సీపీకి ఆయా మీడియా సంస్థలు ఊడిగం చేస్తున్నట్లేనని, ఆయా ఛానెళ్లపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడే అవకాశం లేకపోలేదు..!
చదవండి: TDP Nara Lokesh: ‘ఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్‌లా ఆంధ్రప్రదేశ్..!’ నారా లోకేష్

2 Comments
Comments are closed.