Chandrababu Medical Report: ‘ప్రజాసేవ తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి చంద్రబాబు’.. ఎంపీ రఘురామ

అప్పుడు వైసీపీ నాయకులంతా నానా చెత్తా మాట్లాడారు.. అందుకే ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది

Kanumuru Raghu Rama Krishna Raju Kanumuru Raghu Rama Krishna Raju
Share this :

Chandrababu Medical Report అమరావతి, నవంబర్‌ 18: ‘ప్రజాసేవ (Andhra Pradesh) తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu)’ అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Kanumuru Raghu Rama Krishna Raju) కొనియాడారు. ప్రజాసేవ కూడా ఒక దురలవాటేనని కొంతమంది అంటుంటే, అయితే అది చాల మంచి అలవాటేనని చాలా మంది చెబుతుంటారు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లతో, సకాలంలో మందుల వాడకంతోనే చంద్రబాబు ఆరోగ్యంగా (Chandrababu medical report) కనిపిస్తున్నారని శుక్రవారం (నవంబర్‌ 17) నిర్వహించిన రచ్చబండ (RRR Rachabanda) కార్యక్రమంలో భాగంగా రఘురామ మీడియాతో అన్నారు. కాల్షియం సంబంధించిన సమస్యలకు మందులు వాడుతూ, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఏ నిమిషంలోనైనా చంద్రబాబుకు ఆపద రావచ్చన్నారు. స్టంట్ వేయాల్సిన అవసరం ఏర్పడవచ్చని ఆయన అన్నారు.

చంద్రబాబుకు మధుమేహంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. చంద్రబాబుకు ఉన్న చర్మ సమస్యలను (Chandrababu skin disease) స్కిన్ క్యాన్సర్ అనలేము కానీ, కణాల రీజనరేషన్ తగు మోతాదులో ఉండే అవకాశాలు లేవు. నిరంతరంగా క్రీం అప్లై చేసుకోవడంతో పాటు, స్కిన్ డామేజ్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. జైల్లో ఉన్నప్పుడు చర్మ సంబంధిత సమస్యలతో చంద్రబాబు బాధపడుతుంటే, కొంతమంది నోటికొచ్చినట్లు వాగారు. చరిత్రలో రాక్షసులు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడి ఉండరు. ఏఐజీ ఆసుపత్రి, అమెరికాకు చెందిన మయో క్లినిక్ రోచేస్టర్ వైద్య బృందాలు కూడా 2017, 2019లో వైద్య పరీక్షలను నిర్వహించి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిపారు.

చదవండి: Selfie in Voting Booth: సెల్ఫీ దిగితే ఓటు హక్కు రద్దు.. 3 నెలల జైలు శిక్ష! ఎందుకో తెలుసా..

ఇప్పుడే చంద్రబాబు నాయుడుకి గుండె సంబంధిత సమస్య వచ్చిందా అని కొందరు అంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. గత కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్ల ద్వారా నాకు అందిన చంద్రబాబు వైద్య నివేదికలు, మీకు కూడా అందే ఉంటాయి. సంజీవ్ ఔరంగ బత్కర్ అనే ప్రముఖ డెర్మటాలజిస్ట్ పరీక్షించి చంద్రబాబు ముఖం, ముక్కు పై చర్మ సమస్య ఎక్కువగా ఉందని నిర్ధారించారు.

చంద్రబాబు పై దొంగ కేసులు పెట్టి 53 రోజులపాటు జైల్లో నిర్బంధించిన కారణంగానే చర్మ సంబంధిత సమస్యలు తీవ్రమయ్యాయనేది వాస్తవం. రాష్ట్రంలో వైద్యసౌకర్యాలు బ్రహ్మాండమనిచెబుతున్నప్పటికీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సత్తిబాబు వైద్యం కోసం ఏఐజి ఆసుపత్రిలో చేరారని గుర్తు చేశారు. చంద్రబాబు అనారోగ్య సమస్యలకు సంబంధించి 12 రకాల మందులను తీసుకోవలసి ఉంటుంది. జైల్లో ఉంటే సమయం ప్రకారం తీసుకోగలరా అని రఘురామ ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు పై నిరాధారమైన ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి హింసించాలనుకుంటే చరిత్ర, మానవజాతి మిమ్మల్ని క్షమించదని పాలకులను హెచ్చరించారు.

వైద్యులుగా అవతారం ఎత్తిన సుధా, మిల్లెట్ రెడ్డి

ఉదయం, సాక్షి దినపత్రికలలో విలేకరిగా పనిచేసే, ప్రస్తుతం సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan) సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) డాక్టర్ మిల్లెట్ రెడ్డిగా ప్రస్తుతం వైద్యశాస్త్రంలో కూడా తగినంత ప్రావీణ్యత సంపాదించినట్లు ఉన్నారని రఘురామఎద్దేవా చేశారు. న్యాయస్థానంలో నిజమైన వైద్యులు అందజేసిన నివేదికను, న్యాయవాది నుంచి వైద్యుని అవతారం ఎత్తిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి (Additional Advocate General Sudhakar Reddy) తప్పు పట్టడం విడ్డూరంగా ఉంది. వైద్యులు అందజేసిన నివేదికనే న్యాయమూర్తులు ప్రామాణికంగా తీసుకుంటారు. అంతేకానీ వైద్యశాస్త్రంలో పరిజ్ఞానం లేని వ్యక్తులు చేసే వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెండు కళ్ళకు శస్త్ర చికిత్స జరిగింది. అలాగే ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. ఏడు సంవత్సరాల కింద ఆయనకు నెస్సల్ సర్జరీ చేసిన వైద్యుడు కూడా గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారన్నారు. వైద్యులు ఇచ్చిన నివేదిక బోగస్ అని, ఈసీజీ పరీక్ష చేస్తే తెలుస్తుందన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ కంటే ఆదిమానవుడు నయమని అనిపిస్తోందని రఘురామ అన్నారు. ఈసీజీ అంటేనే తప్పుల తడక అని, ప్రాథమిక రోగనిర్ధారణ కోసమే ఈసీజీ పరీక్షలు చేస్తారన్నారు. గుండె లేని మనుషుల్లో అడ్డంగా వాదిస్తున్నారని గుండె లేదు కాబట్టే, గుండె నొప్పి గురించి వారికి తెలిసే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. గొడ్డలి పోటుకు, గుండెపోటు (Heart Attack) కు పెద్దగా తేడా తెలియదని మనుషులు మీరు అంటూ ఎంపీ రఘురామ విరుచుకు పడ్డారు.

వైద్యుల నివేదికను నమ్మొద్దని సుధాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. న్యాయ మూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఎప్పుడు తీర్పు వెలువడిన వైద్యుల నివేదికను పరిగణలోకి తీసుకొనే తీర్పు ఇస్తారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌ కుటుంబస్తులనే సీబీఐ హంతకుల జాబితాలో చేర్చింది. డబ్బులు ఇచ్చి హత్యకు ప్రోత్సహించినట్లుగా పేర్కొంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఐపీసీ 302 సెక్షన్ మోపబడి జగన్‌ పినతండ్రి జైలుకు వెళ్లారు. జైల్లో ఆయన ఆరోగ్యం బాగా లేనప్పుడు మొదట వారం రోజులపాటు బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని పొడిగించారు. ఏఐజీ వైద్య బృందం ఆయనకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కొన్ని ముందు జాగ్రత్తలు అవసరమని చెప్పింది. మరి ఆయనకు సర్జరీ ఎందుకు చేయలేదు మిల్లెట్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ రెడ్డి అంటూ రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఏఐజి వైద్య బృందం ఇచ్చిన ఆ రిపోర్టు ఫేక్ అంటారా అని నిలదీశారు. ఏఐజీ వైద్య బృందం ఇచ్చిన రిపోర్టును తప్పు పడితే, చిన్నాన్నకు ఇచ్చిన బెయిల్ ను కూడా తప్పు పడుతున్నారా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఏఐజీ వైద్య బృందం, మయో క్లినిక్ రిపోర్టును కూడా తప్పుపడుతున్నారంటే, అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి మాదిరిగా తప్పుడు నివేదికలు ఇవ్వరని గుర్తించాలన్నారు.

జగన్‌ సహోదరుడు కాకపోయినా సోదరుడైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వెళితే ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించడానికి వెళ్లి వైఎస్ కుటుంబీకులు నానా హంగామా చేశారు. మళ్లీ ఆమె అనారోగ్యం గురించి ఊసే లేదు. జబ్బు ఉంటే ఏఐజీ ఆసుపత్రిలో, జబ్బు లేకపోతే కర్నూలు ఆసుపత్రిలో చేర్చుతారు. కర్నూలు ఆస్పత్రిలో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లిని చేర్చినప్పుడు వైసీపీ నాయకులంతా నానా చెత్తా మాట్లాడారు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏఐజి వైద్య బృందం, మయో క్లినిక్ నివేదికల ఆధారంగానే న్యాయమూర్తి తీర్పును ఇస్తారని ఆశిస్తున్నాను. డాక్టర్లు ఇచ్చిన వైద్య నివేదికలను పరిగణనలోకి తీసుకుంటారని ప్యాలెస్ నుంచి ఆడించే తోలుబొమ్మల ఆటలను కోర్టు పట్టించుకోదని భావిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.