PM Modi Roadshow: 2 గంటలపాటు ఆ రెండు మెట్రో స్టేషన్లు మూసివేత.. నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్రారంభమైన ప్రధాని రోడ్‌ షో

Share this :

PM Modi Roadshow in Hyderabad హైదరాబాద్, నవంబర్‌ 27: హైదరాబాద్‌ ప్రయాణికులకు మెట్రో రైలు (Hyderabad Metro station) అధికారులు కీలక సూచన చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌ షో (PM Modi Roadshow) నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు (Chikkadpally and Narayanaguda metro stations) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. దీంతో భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తదనుగుణంగా అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాలని సూచించారు.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్రధాని రోడ్‌ షో (Prime Minister Narendra Modi) ప్రారంభమై.. నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు జరుగుతుంది. ప్రధాని ఈ రోడ్‌షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో భారీగా బలగాలు మోహరించాయి. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆర్చ్, ఓల్డ్ వైఎంసీఏ పోలీస్టేషన్ మీదుగా కాచిగూడలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్డు షోలో పాల్గొననున్నారు. దీంతో దీన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.

చదవండి: Barrelakka in Telangana Politics: పాపం బర్రెలక్క..! ఓవైపు తాగుబోతు తండ్రి వీడియోలు.. మరోవైపు యాంటీ మీడియా బెదిరింపులు..

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

  • ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను వీఎస్‌టీ, బాగ్‌ లింగంపల్లి, క్రౌన్‌ కేఫ్‌ మీదుగా, హిమాయత్‌ నగర్‌ నుంచి నారాయణగూడ క్రాస్‌ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను హిమాయత్‌ నగర్‌ వై జంక్షన్‌ వద్ద ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, సెమెటరీ, రామ్‌కోఠి మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.

 

  • ముషీరాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలను రామనగర సాగర్‌లాల్‌ ఆస్పత్రి మీదుగా, హిందీ మహావిద్యాలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అజామాబాద్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా, తెలుగు మాటల ఫ్లై ఓవర్‌ వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లించారు.

 

  • ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా నారాయణగూడ క్రాస్ రోడ్డుకు వచ్చే వాహనాలను అశోక్ నగర్ మీదుగా మళ్లించారు. నారాయణగూడ శ్మశాన వాటిక నుంచి వచ్చే వాహనాలను రామ్‌కోఠి క్రాస్‌ రోడ్డు, భవన్‌ కళాశాల లేన్‌ మీదుగా మళ్లించారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.