Telangana Ministers List 2023: అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే

తెలంగాణలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్‌ ఇదే

Share this :

Telangana Ministers List 2023 హైదరాబాద్‌, డిసెంబర్‌ 9: తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly Sessions) సమావేశాలు శనివారం (డిసెంబర్ 9) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ (Pro-tem Speaker Akbaruddin Owaisi) ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు మంత్రిత్వ శాఖలను (Telangana Ministers List 2023) కేటాయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ (CM Revanth).. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల శాఖలపై ఈ రోజు ప్రకటన వెలువరించారు.

ముందుగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే..

క్యాబినెట్‌ మంత్రులు.. కేటాయించిన శాఖల వివరాలివే..

*భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
*తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయం, చేనేత
*జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌, పర్యాటకం
*ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాలు
*దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
*కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
*దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
*పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
*పొన్నం ప్రభాకర్‌ – రవాణా, బీసీ సంక్షేమం
*సీతక్క – పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
*కొండాసురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ

హోం, పురపాలక, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం తన వద్దే అట్టిపెట్టుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ జరుగుతున్న కారణంగా తాను ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు గడువు ఇవ్వవలసిందిగా శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.