ఏం…ప్పా… ఎవురూ మాట్టాడటం ల్యా… యాడికి పోయినారు అంతా..?

వైసిపి పాట్టీ ఆపీసు ఓరు కట్టిస్సా ఉండేటిది

Share this :

(మస్తాన్. గగ్గుటూరి
రాయచోటి,అన్నమయ్య జిల్లా)

ఏం…ప్పా… ఎవురూ మాట్టాడటం ల్యా… యాడికి పోయినారు అంతా..?

వైసిపి పాట్టీ ఆపీసు ఓరు కట్టిస్సా ఉండేటిది అంటే ఓరు పలకడం ల్యా.. ఏంది కథ..?

రాయచోటోల్లంతా మొన్ననే చెప్నారు కదా తాజా మాజీ సారు నోరు తెరసాలని.. సారు గమ్ముగా ఉండాడు ఎందుకో..?

సారు.. నోట్లో నించి నిజాలు ఇనాలని మనోళ్ళు కాసుకొని ఉండారంట..?

ఆయప్ప ఎందుకు తెరుస్సాడు నోరు.. రాసిటోళ్ళు అంటే భలే సౌక కదూ ఆయప్పకు.. ఓట్లు నాలుగు మాట్లు యేసిండే పని.. మళ్ళా సచ్చినట్లు ఏస్సారులే అని పే..ద్ద ఇది..?

రాట్టం మొత్తం 25 జిల్లాల్లో భూములు ఇట్టానుసారం యాడ బడితే ఆడ తీసుకొని కోట్లు పెట్టి బిల్లింగులు కట్నారా?

సిత్తూర్ లో మాత్తం కట్లా బిలింగులు.. ఎందుకో ఇసిపెట్నారు..?

తీరా చూత్తే ఏమైనాది అంటే.. కోట్లు ఇలువ అయిన భూములు, కోట్లు పెట్టి కట్టిస్సా ఉండి గూడ వొళ్ళ పభుత్వమే ఉన్యా ఒక్క దానికి పరిమీశను తీసుకోల్యా ఎందుకో..?

ఏం రా ఇది అంటే..పభుత్వం మాదే కదూ..మమ్మల్ని పేశ్నించేది ఓరు అనే అహంకారం కళ్ళకెక్కింది అంతే కదూ..?

మళ్ళా మేమే వత్తాం.. మేము ఆడిందే ఆట.. పాడిందే పాట అనుకున్యారు.. నిజంగా కదూ..?

దేవుడు సుస్సా ఊరికే ఉంటాడా.. వంగబెట్టి, లేపి తంతే యాడ పడ్నారో వొళ్ళకే ఇంగా తెలీల్యా..?

కండ్లు నెత్తికెక్కినోళ్ళు ఇండ్లల్లో కూచొని టీవీలు సూస్కొంటాండారు.. దేవుని దయ.. జనం ఓట్లతో యాడాడ దెబ్బలు తగిల్నాయో దిక్కు తెలీడం ల్యా కదున్నా..?

ఇదంతా ఎందుకు లే ప్పా నాకు..

మా మాజీ సారు పెస్ మీట్ పెట్టి నిజాలు చెప్తాడను కుంటాంటే ఉలుకు పలుకు ల్యాకుండా ఉండాడు.. ఏమైందో..?

సార్.. నిజాలు సెప్పాలంట.. పెస్మీట్ కు ఇలేఖర్లను రమ్మని చెప్తా.. సెప్పాలా వద్దా.. ఏం మాట్టాడవు ఏంది ల్యా.. ఏమైంది సారూ నీకు ?

ముసిపాలిటీ వొల్లను ఏమీ య్యాా పాట్టీ ఆపీసు కు నోటీసు ఇచ్నారా అంటే..?

పోయ్యా సామి.. పాట్టీ ఆపీసు లేదు.. గీట్టి ఆపీసు లేదు.. ఆ ఆపీసు మా ముసిపాలిటీ లో లేదు.. ఆ పక్కన పల్లెలో ఉంది..పొయ్యి ఆడ ఆడుక్కోపొండి అంటాండరు.. ఏంది రా సామి ఇది పోగాలం..

ఇదంతా ఎందుకు లేప్పా నాకు

ఇదేం ఇడ్డూరం రా సామి.. మూతి మొగదాల ఉండే వైసీపీ ఆపీసు, చల్లంపల్లి ముసీపాలిటీ లో లేవంట…

మేమంతా అంతే.. మా రాజకీయం పొగూడదు..చల్లంపల్లి ఐదు సార్లు ఓసీ కి ఎట్ట వచ్చింది..?

ఎట్ట వొచ్చింది అంటే సారు రాజకీయం.. అంతే అట్టుంటది మనతోని.. ఏమంటావు సారూ..?

పక్కూరినించి సారు ఈడికి వొచ్చి రాజకీయం సేసినాడు..

పోయిన పదైదెండ్లు మా వూరోళ్ళు సొంతూరోళ్ళకు ఓటు యేయాలని ఎందుకో అనిపిచ్చల్యా..? అందుకు సారూకు అడ్డం ల్యాకుండా పోయింది..

అబ్బా.. ఇయన్నీ ఎందుకు ప్పా సామి నాకు… సారూ పిలిపిస్సా ఇలేఖర్లను..

ల్యాకపోతే మళ్ళా, మళ్ళా జనం అడగతాంటే మనం ఏందో సేసినాం అనుకుంటారు..

మనకు సెడ్డ పేరు వొద్దు.. ఎకరా 61 సెంట్లకు లీజు ఎంత, ఎన్నెండ్లు, బిళ్లింగు కట్టేదానికి మనకు లెక్క ఓరిచ్చినారో సెప్పెయ్ సారూ.. మనకెందుకు ఈ పంచాతీ..

సారూ.. ఇది నిజమా..? మన పాట్టి వొళ్ళు సెప్తాండారు ఆపీసు కట్టేదానికి మన పాత కడప జిల్లా ఎంఎల్సీ సారు లెక్క ఇచ్చేది నిజంగానా సారూ

మనోళ్లే సెప్తాండరు సారు.. నువ్వు ఆ మాటే సెప్పేయ్ సారు..

ఇప్పుటికే రెండు కోట్లు ఇచ్నారంట కదూ సారు.. నిజమేమో చెవులో చెప్పు సారూ.. నిజంగా నేను ఓరికి చెప్పను సారూ..

ఏంది సారూ.. ఆ సిమింటు అంగిడి ఆయప్పకు పది లచ్చలు ఇయ్యాలంట నిజమా సారూ..?

మళ్ళ లెక్క ఇస్సామని సెప్పి ఆపీసు కోసం పది లచ్చల సిమింట్ తెచ్చినారంటనే..?

లెక్క ఈలేదని ఆయప్ప నెత్తి నోరు కొట్టుకుంటాన్డాడు..

ఇన్నిన్ని అప్పులు ఈక పోతే వాళ్ళు సావరూ..? పాపం నీదే అయితాది సారూ..? భద్రం రొంత..?

ఇట్టా నోళ్ళు కొట్టి ఆపీసు కడ్తే బిళ్ళింగు ఉంటాదా..? నువ్వు శెప్పు.. పాపాలు చానానే ఉండాయి కదా సారూ..?

నాకెందుకులే ప్పా సామి ఇదంతా..

నోరె తెరిసి ఏదో ఒకటి సెప్పు సారూ.. నీకు అన్నీ తెలుసు కదా.. ఒక కథ సెప్పేయ్.. మన రాసీటోల్లే కదూ ఇంటారు.. ఇన్ని రోజులు చెప్లా..ఇప్పడు గూడ అంతే..

వరిగ పంచాయతీ వొళ్ళు.. మా పాట్టీ ఆపీసు మీ గామంలో ఉందంటనే నోటీసు ఇస్సాండరా లేదా? మాకు ఏదో ఒకటి సెప్పండి.. సారు కు సెప్పాలా వద్దా..?

నాకెందుకు లే సామి పంచాతీ

ఈడ సారు.. నోరు తెరసడం ల్యా.. రాసీటోళ్ళు మాత్తం..నోటికొచ్చినట్టు దె.. ఏందో అనుకోవద్దు..? దెబ్బలు కొడతారు అని సెప్తాండ..

రాశీట్లో కట్టిన బిలింగు పభుత్వం తీసుకువాలంట. కొట్టేయ్యద్దంటాండారు. మళ్ళా వాళ్లకు పోకుండా జిల్లా ఆపీసులకు ఇయ్యాలంట. బిల్డింగ్ లు ఇప్పుడే తక్కువుండాయి. పగలగొడ్తే యెట్టా పేశ్నలు ఏస్సాండారు…

ఈయన్ని నాకెందుకు లే ప్పా…

నేను సెప్పేది చెప్నా.. సారు ఏం పలకలా.. నేనేం సెప్పాల సెప్పండి..ఊరికి వస్సే మీరే అడగండి..

ఇయన్ని నాకెందుకు సామి.. నా పని నేను సూసుకుంటా..? సారూ .. నువు పలకడం ల్యా.. నేను పోయిస్సా..