ఈ ఆపీసోల్లకు ఎంత సెప్పినా సెవులు ఇనపడవు… కండ్లు కనపడవు… మాటలు ఇనపన్యా… సెవులు పోయినట్లు నటిస్సా… కుచ్చీలు ఇసిపెట్టకుండా ఉంటాండరు సారూ…
ఆ దున్నపోతు మీద వాన పడినా అది ఆన్నుంచి కదిలి కాలబడదు… రెండూ ఒక్కటే…
సారూ… రాసీట్లో మఊరి కాడ ఉండే ఇందిరమ్మ కాల్నీ లో ఇంటి తావులు పప్పులు, బొరుగులు అమ్మినట్లు అమ్ముతాండ్రని రెండ్రోజుల కాడ నేను సెప్పిన కదా సారు…
యాదవుల పల్లె సాన్జినేయులు, ఓల్ల కొడుకు, అడ్డెరుపల్లే సయ్యేరు రెడ్డి, అంకర్ రెడ్డి, సానే. కీకాంత్ లు అమ్ముతాండ్రని సెప్పినా కదా… ఏం పట్టించుకోరా? సారూ…
అమ్మేదానికి చానా గునాదులు ఏసినారు సారూ…
ఇంతో అంతో లెక్కలుండే వొళ్ళ దెగ్గర గూడ లచ్చలు పీక్కుంటా రత్తం తాగుతాండరు సారూ…
ఓ రవ్వ పెభుత్వ భూమి ఆక్కమించుకోకుండా కాపాన్యా అంటాండవే… ఈడ ఇట్టానుసారం నీ పేరే సెప్తా బెదిరిస్సాండరు… ఏం సెయాల సారూ…
కండ్ల ముందు ఇంత అన్నాయం జరుగుతాంటే మీకు ఎందుకు అన్నాయం కనపడటం లేదో అర్థమే కాలా నాకు సారూ???
మా లాంటి బీద నాకొడుకుల కడుపులు కాలి సస్సే సచ్చినారు లే అనుకుంటాండ్రా సారూ…
బీదొల్లంటే మీ కండ్ల పడటం లేనట్లు ఉంది సారూ… మా పరిత్తితి చానా అధ్ధోన్నం సారూ …
ఒక్కొక్కడు పదులు పదులు తావులు అమ్మడం, గునాదు లేసి లచ్చల్లో అమ్ముకోవడం… రోజూ లచ్చలు సంపాయిచ్చి పంది కొక్కుల మాదిరి తినేస్సాండరంట సారూ…
మీరు ఆడికి పోయి రొంత ఇచారించండి సారూ…
పట్టించు కోవాల్సిన ఆపీసోల్లు ఉండ్లా… ఒళ్ళు ఒక్కరు గూడ ఆ పక్క నెత్తి ఎత్తి సూడటం ల్యా…
ఎర్రజెండా లోల్లు ఉండ్లా… ఒళ్ళు ఎన్ని మాట్లు నెత్తి నోరు కొట్టు కున్యా, రోడ్ల మింద దొల్లాడినా ఒక్కరూ పట్టిచ్చుకొలా సారూ???
పాత కలకటేరు కు సెప్పిన పట్టించుకోలా… ఒళ్ళ టైం నడుస్సాందని అతి సేస్సానే ఉండారు…
య్యో… సామి…అయ్యా… అమ్మెల్యే సారూ… నీకు దండాలు సామి… రోంత బీదొల్ల దిక్కు సూడు సారు…
అది కాదు సారూ… బిచిలీ గుట్లో గునాదులు ఏసినోల్లయి కొట్నారు… ఆంజనేయ సామి గుడికాడ, రవ్వల గుట్లో బీదొడు ఏవొరన్న గునాది ఎస్సే పగల గొట్టేస్సారు… ఈడ ఇందిరమ్మ కాల్నీ లో అడ్డంగా కట్టే గునాదులు మాత్రం కొట్టరు… ఎందుకు సారూ???
ఈడ ఉండే ఆపీసర్లకు సెవులు ఇనపడవు, కండ్లు కనపడవు అని బీదొల్లు అంటాండరు…
మీ పేరు సెప్పి తావులు అమ్మే ఓల్లకు చర్మం ఒలుస్సా అని సెప్పండి…
ఒళ్ళకు సెప్పకుండా ఉండేటివి అమ్ముకోమన్యారనుకో బీదొల్ల నోట్లో దుమ్ము మీరే కొట్టినట్టు ఐతాదని ఈ బీదోళ్లు అంటాండరు సారూ…
సారూ… బాగా ఆలోసిచ్చి అన్నాయమ్ జరిగినోల్లకు నాయం సేయండి… ఉండే రోన్ని తావులన్నా కాపాడండి…
ల్యాకుంటే కొత్త కలకటేరు కాడ ఎర్రజెండాలోళ్లు, పట్టాలుండే వొళ్ళు ఇంగా పెజాసంఘాలోల్లు కలిసి అడ్డంగా రోడ్డు మింద కూచొంటాము అంటాండరు సారూ…
అంతా నీకు తెలిసే జరుతాందని అప్పుడు రాసీటోళ్లకు తెలుత్తాది… ఇంగ మీ ఇట్టం సారూ…
పోయోస్సా సారూ… పెజాసంఘాలోల్లు పోన్ సేస్సాండ్రు…
– సముద్రవాణి
