ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా రాయచోటి తాజా మాజీ ఎమ్మెల్యే గారు… అరెరే..
ఏంటి…రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయా?? ఎప్పుడబ్బా ??? మావోల్లకు కనిపించడం లేదే సారూ? ఏం సునీలు నిజంగానా ?
ఏంబ్బా… సునీల్ … మీ మాజీ ఎంఎల్ఏ సారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతా ఉండాడు.
మీ పార్టీ వాళ్ళ మీద దాడి జరిగితే ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్లు… డెమోక్రసీ క్షీనించినట్లా ??? అబ్బా భలే న్యాయమే ?
ఇప్పుడు ఎంపీ గారి వాహనాలు దెబ్బతింటే ప్రజాస్వామ్యానికి చేటు వచ్చిందా ? పెద్ద అన్యాయమే జరిగిందే!! అయ్యయ్యో??
ఎన్నికల ముందు ప్రజల చేత ఎన్నుకోబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు నాయుడుని పుంగనూరులోకి రానివ్వకుండా అడ్డుకున్నపుడు మీ రాజ్యం లో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలు పరిడవిల్లిందా సారూ ??
అంగళ్ళు వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు ఉన్న వాహనం పై మీ పార్టీ వారు రాళ్ళు వేసి అక్రమ కేసులు పెట్టి ఎంతో మంది రెండు నెలలకు పైగా వారిని కుటుంబాలకు దూరం చేసినపుడు ప్రజాస్వామ్యం ఆనందం తో నెమలిలా పురివిప్పి నాట్యం చేసిందా మాజీ ఎమ్మెల్యే గారు ?
మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వస్తే టీడీపీ వారు ఎంపీ మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు కదా ?
మరి దళిత మాజీ ఎంపీ అంటూ దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా ?
ఇదే దళిత డ్రైవర్ ను మీ పార్టీ ఎమ్మెల్సీ ప్రాణాలు తీసి డ్రైవర్ ఇంటికి పార్శిల్ వచ్చిందని వారి కుటుంబానికే అతని మృతదేహాన్ని పంపితే అప్పుడు ప్రజాస్వామ్యం ఉరకలేసిందా సారూ ??
కడప జిల్లా పశుసంవర్ధక శాఖ పని చేసే దళిత ఉద్యోగి అచ్చెన్నను చంపి గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో పడేసినపుడు ప్రజాస్వామ్యం హిమాలయాల ఎత్తు ఎదిగిందా సారూ ??
టీడీపీ సానుభూతి పరులు సైకిల్ కు జెండాలు కట్టారని ఊరు కాని ఊరి వాళ్ళను కొట్టి, తిట్టినపుడు ఎక్కడికి పోయింది మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం మీ వెంట నడిచిందా మాజీ ఎమ్మెల్యే సార్ ?
టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హత్యలు, దాడులు ఎక్కువయ్యాయని చాలా బాధపడుతున్నారు… పాపం…
మీ ప్రభుత్వ హయాంలో రాజకీయ హత్యలు జరగలేదా? ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య హత్య , ప్రొద్దుటూరులో కొందరు వ్యక్తులు నడిరోడ్డు పై ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపింది మీ ప్రభుత్వ పాలనలోనే… మరి నాడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా సారూ ???
మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు అంటున్నారు!
తన అక్క మీద మీ పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని పదేళ్ల బాలుడు తిరగబడితే ఆ అబ్బాయిని దారుణంగా చంపేసినపుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం ??? నాడు మీరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదే ??? ఆ రోజు ఏమైంది సారూ మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం…?
మీ పార్టీ మాజీ ఎంఎల్ఏ మహిళ పై రేప్ అటెంప్ట్ పై కొద్ది రోజుల కింద అరెస్ట్ చేశారు. ఇది తప్పు అని మీ లాంటి పెద్దలు కనీసం నోరు తెరవలేకపోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం ???
ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత తప్పులు మీ పాలనలో సైతం ఉన్నాయా లేవా సార్ ??? నిజం చెప్పండి !
సారూ… చట్టం తన పని తాను చేసుకున్నట్లు… ఖర్మ సైతం ఎవరినీ వదలదు… పాపాలు పండినపుడు ఎవరైనా అనుభవించాల్సిందే…
రాజకీయాలు చేసే వారు విలువలు మరిచి పోవాలా ?
గతంలో వారి పాలనలో జరిగిన తప్పులు, ఘోరాలు గుర్తు రావా ? ప్రభుత్వం మారిన వెంటనే ప్రతి నాయకుడు పే…ద్ద ప్రతీవ్రతల్లా మాట్లాడతారు !!! ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన వీరికి ఉండదా ?
ఏమోలే నాకెందుకు ?
