ఏపీకి సెంట్రల్ మినిస్టర్ క్రేజీ గిఫ్ట్..!

ఏపీకి ‘బుల్లెట్’ వార్త

Share this :

విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారుతుందన్న ఆయన.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నాను అని తెలిపారు. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోందని, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయన్నారు.

ఎంఓయూ చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరుగుతోందని, ఏఐ డేటా సెంటర్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉందన్నారు అశ్వినీ వైష్ణవ్. ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్ గా ఎదిగింది. మన దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరించిందని, గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయిందని పేర్కొన్నారు. సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని, ప్రధాని మోదీ చొరవతో మొబైల్ మాన్యు ఫాక్చరింగ్ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశామని తెలిపారు.

డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ద్వారా ఏపీకి రూ. 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించామన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి కేవలం రూ. 886 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేదని, ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఏపీని కనెక్ట్ చేస్తూ నిర్మాణంలో ఉన్నాయన్నారు. దేశంలోనే తొలిసారి నవ నిర్మాణ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 74 స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని వివరించారు. 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం జరిగాయి. 1039 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.

100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏపీ అన్నారు. 16 వందే భారత్ సర్వీసులు ఏపీలో నడుస్తున్నాయని, ఏపీలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లాంటి కీలకమైన విభజన హామీని కేంద్రం నెరవేర్చిందన్నారు. 2026 జూన్ 1 తేదీన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నామని పేర్కొన్నారు. అమరావతి నుంచి హైదరాబాద్ కు బులెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారం కాబోతోందని తెలిపారు. 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్ కు చేరుకునేలా ఈ ప్రాజెక్టు వస్తోందని, 112 నిముషాల్లో అమరావతి నుంచి చెన్నైకు చేరుకునేలా బులెట్ ట్రైన్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు.