ఐపీఎల్ తాజా సీజన్ లో లీగ్ దశ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని సంక్షోభం తెరపైకి వచ్చింది. గత రెండు సీజన్లుగా జట్టును నడిపిస్తున్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే కాకుండా, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని పూర్తిగా వీడాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. యాజమాన్యంతో వచ్చిన విభేదాలు, సత్సంబంధాలు దెబ్బతినడం వల్లే హార్దిక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also read: నీట్ రీ-ఎగ్జామ్ కోసం రంగంలోకి ఆర్మీ..?
ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. 2024 సీజన్ కు ముందు రోహిత్ శర్మను కాదని హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై అప్పట్లోనే పెద్ద దుమారం రేగింది. తాజా వైఫల్యాల నేపథ్యంలో హార్దిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తుండగా, అంతకంటే ముందే హార్దిక్ స్వయంగా జట్టు నుండి బదిలీ కోరుకుంటున్నట్లు సమాచారం. హార్దిక్ తప్పుకుంటే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also read: వైఎస్ షర్మిలకు రాజ్యసభ దక్కితే.. వైసీపీకి జరిగే 5 నష్టాలు ఇవే..!
