నేడు జాబిలిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్‌-3

Share this :

దేశం గర్వించదగ్గ రోజు రానే వచ్చింది..  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం నేడు చివరి అంకానికి చేరుకుంది. మన దేశమే మాదు.. ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు జాబిల్లిపై చంద్రయాన్ – 3 అడుగు పెట్టడం పై ఎంతో క్యూరియాసిటితో ఎదురు చూస్తున్నారు.

బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రగ్రహంపై విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టబోతుంది. ల్యాండింగ్ కి ముందు అన్ని విధాలుగా మాడ్యూల్ లోని పారామీటర్లను చెక్ చేస్తారు. ఆ తర్వాత నిర్ధేషిత ప్రాంతంలో చంద్రగ్రహంపై సూర్యోదయం వరకు ఎదురు చూస్తారు. అన్నీ కుదిరితే ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం 5.45 గంటల నుంచి 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ పూర్తిగా ల్యాండ్ అయ్యే 20 నిమిషాలు టెర్రర్ మూవ్‌మెంట్ అని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో ఈ దశంలోనే చంద్రయాన్ – 2 కూలిపోయిన విషయం తెలిసిందే.