తాజా వార్తలు

ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన CM కేసీఆర్‌!

Share this :

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడానికి పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్ లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.

నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసే వారికి మళ్లీ వారి స్థానాలు వారికే కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక టికెట్లు వచ్చినవారికి అభినందనలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం ప్రజల మద్దతు సమకూర్చుకోవాలని వారికి సూచించారు.