ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతుంది. 2019 లో కిస్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రీలీల. 2021లో పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది శ్రీలీల. ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది శ్రీలీల. తాజాగా ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
టాలీవుడ్ లోకి పెళ్లి సందD మూవీతో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. మొదటి మూవీ మంచి సక్సెస్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో పాటు గ్లామర్ షో తో కుర్రకారు మనసు దోచేస్తుంది. మాస్ మహరాజ రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ తర్వాత శ్రీలీల కెరీర్ ఒక్కసారే మలుపు తిరిగింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలకు పైగా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఈ అమ్మడి కోసం రెడీగా ఉన్నట్టు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దాదాపు రెండేళ్ల వరకు ఆమె డేట్స్ కి భారీ డిమాండ్ ఉందనే చెప్పాలి.
తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని భారీ ఆఫర్లతో బిజీగా ఉంది. తాజాగా శ్రీలీల కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఓ రెండు నెలల పాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఆ న్యూస్ సారాంశం. ప్రస్తుతం శ్రీలీల ఎం.బి.బి.ఎస్ చదువుతుంది. ఈ ఏడాదితో తన చదువు కూడా పూర్తి అవుతుంది. ఈ క్రమంలో ఫైనల్ పరీక్షల షెడ్యూల్ రావడంతో ప్రిపరేషన్ కొనసాగించాలని నిర్ణయానికి శ్రీలీల వచ్చారట. అందుకోసం ఆమె రెండు నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
