టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు సెప్టెంబర్ 2వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ అప్ కమింగ్ మూవీస్ ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్, హరి హార వీర మల్లు మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ ను చిత్ర నిర్మాణ సంస్థలు యూట్యూబ్ వేదికగా విడుదల చేసాయి. ఇందులో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ కు సంబంధించిన టీజర్ పవర్ స్టార్ ప్రేక్షకులను సంబరాలను చేసుకునేలా చేస్తుంది.
ఈ టీజర్ లో కత్తి , గన్ లతో హల్చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ మతిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ బర్త్ డే సందర్భంగా ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా మూవీస్ కు సంబంధించిన స్టైలిష్ క్రేజీ లుక్స్ ను చూసి పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అటు సినిమా ఇటు రాజకీయ రంగ ప్రముఖుల శుభాకాంక్షలతో సామాజిక మాధ్యమాలు సందడి సందడిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
