టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిచేసే బాధ్యత నాదంటున్న చంద్రబాబు….!!

Share this :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ప్రజలు భారీగా తరలివచ్చారు.ఆ సభ లో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు జగన్ పై విరుచుకు పడ్డారు.సైకో జగన్‌కు పోలీసులు మరియు ధన బలం ఉందేమో కానీ దాని కంటే గొప్పదై నా ప్రజాబలం తన దగ్గరుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ అనే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ నేను చేసే పోరాటం నా కోసం కాదని, రాష్ట్రాన్ని దోపిడీ దొంగల నుండి కాపాడుకోవడం కోసమనన్నారు. దాంట్లో భాగంగానే మనమందరం చేయి చేయి కలుపి రాష్ట్రాన్ని ఆ దొంగల నుండి కాపాడి అభివృద్ధి చేద్దాం అని అన్నారు.

అయితే ఒక్కఛాన్స్ ఒక్కచాన్స్ అని చాలా మోస పోయాం అని ఒక్క రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచారన్నారు.మేము ఇసుక ధరలపై ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. ప్రజలు స్వేచ్ఛగా కూడా మాట్లాడకుండా చేస్తున్నారు. అయితే నారా లోకేష్ చేస్తున్న యువగళం ప్రజాగళం అనేది ఒక ప్రజా ఉద్యమంగా మారింది.

యువగళం వాలంటీర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. గుత్తి చెరువుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.తెదేపా హయాంలో హంద్రీనీవా నీళ్లుతీసుకువచ్చాం. దాంట్లో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మించి అక్కడ కియా పరిశ్రమ తెచ్చాం.ఈ ఇండస్ట్రీ ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం.ఈ సభ ద్వారా అందరికి చెప్తున్నది ఏంటంటే నేను టెక్నాలజీ ద్వారా మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తా అని అందరి ముందు మాట ఇస్తున్న అని చంద్రబాబు అన్నారు.