ఆ కారణంగా సంతోషంతో మిఠాయిలు పంచిన టీడీపీ నేత….!!

Share this :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సెన్సేషనల్ న్యూస్ గా మారిన చంద్రబాబు అరెస్ట్ కారణం స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో జరిగిన స్కాం కి ప్రధాన సూత్రధారుడు, ఈ కేసులో ఏ1 నిందితుడు అని అనడం. ఆయన అవినీతి కేసులో అరెస్ట్‌కావడంతో నెట్టింట్లోనూ కరెప్షన్‌ కింగ్‌ పేరుతో చంద్రబాబు అని ఆడుకుంటున్నారు.అయితే ఓవైపు పార్టీ అధినేత కోసం ఆందోళనకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే అక్కడ ఒక నేత మాత్రం స్వీట్లు పంచుతూ పండగ చేస్తున్నారు.ఈ శనివారం మధ్యాహ్నాం విజయవాడ కోర్టు వద్ద ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది.

టీడీపీ నేత చంద్రబాబునాయుడును అరెస్టు చేసినందుకు విజయవాడ కోర్టు వద్ద మిఠాయి పంచి పెడుతూ కనిపించారు టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర రావు. ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు విచిత్రంగా చూశారు. అయితే ఈ చర్య అక్కడి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు దారి తీసే ఛాన్స్ ఉందని పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆయన అలా చేయడానికి కారణం ఏంటంటే తనను చంపేందుకు నారా లోకేష్‌ కుట్ర చేస్తున్నారంటూ ఈ మధ్యే ఆరోపణలు గుప్పించారు. ‘పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న. జూబ్లీ హిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే ఎల్. నారాయణ లాకున్నారు. న్యాయం చేయాలని ఆయన అడిగితే పెద్దగా పట్టించుకోవడంలేదు. నన్ను వాడుకొని వదిలేశాడు అని అన్నారు.నాకు చంద్రబాబు అన్యాయం చేశారు. అసలు పార్టీ లేదు, ఏమీ లేదు అన్నవారికేమో టీడీపీ అధ్యక్షుడిని చేశారు అని ఆయన బాధ పడ్డారు.