విద్యార్థులకు అలర్ట్.. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. నీట్ (NEET), జేఈఈ(JEE), సీయూఈటీ (CUET), NET వంటి పరీక్షల ప్రవేశానికి సంబంధించి షెడ్యూల్ తేదీలను ప్రకటించింది. ఇక విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన వివరాలను NTA తమ అధికారిక వెబ్సైట్ https://www.nta.ac.in లో చూసుకోవచ్చు అని తెలిపింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష జనవరి – ఫిబ్రవరిలో జరగనుంది. ఇక రెండవ సెషన్ ఏప్రిల్ మాసంలో నిర్వహించనుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనున్నట్లు తెలిపింది. ఇక నీట్ యూజీ 2024 ఎగ్జామ్ తేదీని సైతం వెల్లడించింది.
వివిధ పరీక్షల ఎగ్జామ్ డేట్స్ ఇవే:
– 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ (సెషన్-1), ఇది కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
– 2024 ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్ (సెషన్-2)
– నీట్ యూజీ – మే 5, 2024వ తేదీన దేశవ్యాప్తంగా పరీక్ష జరగనుంది. అయితే ఇది పెన్ను పేపర్/ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది.
– సీయూఈటీ- యూజీ – మే 15 నుంచి 31 వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
– సీయూఈటీ – పీజీ : మార్చి 11 నుంచి 28 వరకు యూనివర్సిటీల పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది.
– యూజీసీ నెట్ (సెషన్-1)- 2024 జూన్ 10 నుంచి 21 వరకు పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష
ఇక ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం రిసిస్ట్రేషన్ ప్రారంభించిన సమయంలో అభ్యర్థులకు వెల్లడిస్తామని NTA ఈ సందర్భంగా తెలియజేసింది. కంప్యూటర్ ఆధారంగా జరిగీ ఎగ్జామ్స్ ఫలితాలను పరీక్షలు జరిగిన 3 వారాల్లోపు ప్రకటిస్తామని తెలిపింది.నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ఫలితాలను వచ్చే సంవత్సరం జూన్ రెండవ వారంలో ప్రకటించనున్నట్లు ప్రకటించింది.
