సీఎం జగన్ తీరుతో రెడ్లలో తీవ్ర వ్యతిరేకత!

Share this :

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ లో ఉంచిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ పై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఏపీ అసెంబ్లీలో ఈ అంశంపై రచ్చ రచ్చ అవుతుంది. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఎం జగన్ తీరుపై సొంత సామాజికవర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. జగన్ సర్కారు తీరుతో తలవంపులని వేదన తీవ్రమైందని మండిపడుతున్నారు. 

ఏపీలో జగన్ సర్కారు  ప్రతిపక్షాలపై మితిమీరి వేధింపులకు గురి చేయడం.. ప్రత్యర్థుల గొంతునొక్కేయడం లాంటివి చేస్తుందని తీవ్ర వ్యతిరకేత మొదలైంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారికో, వైఎస్సార్సీపీ వారికో అత్యంత సంతోషంగా ఉండవచ్చు.. ఎందుకంటే ఇప్పుడు వారి ప్రభుత్వం ఉంది.. కానీ రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే, ప్రతిపక్షంలోకి వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీలైనా ప్రతిపక్షాలను వేధించడం సహజం. కానీ ఏపీలో జగన్ సర్కారు అంతకుమించి చేస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. నాలుగేళ్లుగా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కొత్త సెక్షన్లు తీసుకువస్తూ నిర్భందించడం లాంటివి చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రజాస్వామ్యంలో అన్యాయాలపై ప్రశ్నించడం పౌరుడి హక్కు. కానీ జగన్ సర్కార్ ని ప్రశ్నిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిరసనలు, శాంతియుత ప్రదర్శనలు చేపడితే అక్రమ కేసులు, నిర్బంధాలతో భయబ్రాంతులను సృష్టిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర అయినా.. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అయినా వైసీపీ సర్కారుకు వెంటనే నిబంధనలు గుర్తొస్తాయి. ఇలా చేయడం వల్ల ప్రజల్లో పూర్తి విశ్వాసం కోల్పోతున్న విషయం జగన్ గమనించాలని సొంత సామాజిక వర్గం అయిన రెడ్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపిస్తే చాలు.. వాటి ప్రతినిధులందరికీ నోటీసులు వెళ్తాయి. గృహ నిర్బంధాలు, కదలనీయకుండా అడ్డుకోవడం, భారీగా బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురిచేయడం జగన్ ప్రభుత్వ దమన నీతి. పోలీసులను వాడుకుంటూ ప్రతిపక్షాలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కులసంఘాలకు ప్రత్యేక నిర్బంధాలు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారు సీఎం జగన్ అని అంటున్నారు రెడ్డి సామాజిక వర్గం.

ఇక టీడీపీ అధికారంలో ఉండగా.. ఓ సామాజిక వర్గానికే అన్నీ ఇచ్చేస్తున్నారని ప్రచారం చేసిన వైసీపీ.. తాము అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేమిటి? పదవుల్లో అత్యధికం వారి వర్గానికే ఇవ్వడం లేదా? పోలీసు పదోన్నతుల సందర్భంగానూ టీడీపీపై దుష్ప్రచారం చేసి లబ్ధి పొందిన వైసీపీ ఆనక దానిపై మాట్లాడింది లేదు. దీన్నిబట్టే జగన్ సర్కారు, వైసీపీ తీరు తెలిసిపోతోంది. ఇదనే కాదు.. వైసీపీకి అండగా నిలుస్తున్న సామాజిక వర్గం సైతం జగన్ ప్రభుత్వ ధోరణులతో మిగతా వర్గాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తోంది.